జాతీయ వార్తలు

మురికి దుప్పట్లు.. ఉతకని తువాళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: మురికి దుప్పట్లు, ఉతకని తువాళ్లు, శుభ్రం చేయని తలదిండు కవర్లు.. ఇదీ రైల్వేశాఖ ప్రయాణికులకు అందజేస్తున్న సౌకర్యాల తీరు. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాల తీరుపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) చేసిన అధ్యయనంలో వెలుగుచూసిన నిజాలు ఇవి. వీటి శుభ్రతపై రైల్వే శాఖలో పేరుకు పోయిన నిర్లక్ష్యాన్ని కాగ్ తన నివేదికలో ఉతికి ఆరేసింది. రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సౌకర్యార్థం అందజేస్తున్న దుప్పట్లు, పిల్లో కవర్లు, తువాళ్ల శుభ్రతపై కాగ్ దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే డిపోలలో 2012-2016 సంవత్సరాల మధ్య కాలంలో జరిపిన అధ్యయన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. రైళ్లలో ప్రయాణికులకు అందిస్తున్న దుప్పట్లు, దిండ్లు, తువాళ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పెట్టుకున్న నిబంధనలను రైల్వేశాఖ ఉల్లంఘిస్తుందని కాగ్ ఘాటుగా విమర్శించింది. నిబంధనల ప్రకారం రెండు నెలలకోసారి దుప్పట్లను డ్రైక్లీనింగ్ చేయించాలి, అలాగే తువాళ్లు, పిల్లో కవర్లను ఒక్కసారి ఉపయోగించిన వెంటనే ఉతికి శుభ్రం చేయాలి. రైల్వేలో ఉపయోగిస్తున్న దుప్పట్ల సంఖ్య, వాటిని ఎన్నిసార్లు ఉతికి శుభ్రం చేశారన్న డాటాను కాగ్ సేకరించింది. తొమ్మిది రైల్వే జోన్లలోని 33 డిపోలలో 2012 నుంచి 2016 వరకు ఒక్కసారి కూడా దుప్పట్లను ఉతికిన పాపాన పోలేదని అధ్యయనంలో వెల్లడైంది. 2015-16 మధ్యలో 12కోచింగ్ డిపోలలో దుప్పట్లను 6నుంచి 26నెలలకోసారి మాత్రమే డ్రైక్లీన్ చేసినట్లు వెల్లడైంది. పైన పేర్కొన్న 12 డిపోలలో సికిందరాబాద్ డిపో కూడా ఉండడం విశే షం. డిపోలలో పాడైన దుప్పట్లు, తువాళ్లతోపాటు కొత్త వాటిని కూడా కలిపి భద్రపరిచారు. చెన్నైలోని బేసిన్ బ్రిడ్జి డిపో అయితే పాడైన బెడ్‌షీట్లనే చించి పిల్లో కవర్లుగా కుట్టేశారు. ఉత్తర రైల్వేలో ఉపయోగించిన పిల్లోకవర్లనే మళ్లీ మళ్లీ ప్రయాణికులకు శుభ్రం చేయకుండా సరఫరా చేశారు. దుప్పట్లు, తువాళ్లు, పిల్లోకవర్లను ఎప్పటికప్పుడు ఉతికి శుభ్రం చేసేందుకు అత్యాధునిక లాండ్రీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాగ్ తన నివేదికలో అభిప్రాయపడింది. ఆ విధంగానే వీటిని భద్రపరిచేందుకు కావాల్సిన స్టోరేజ్ సౌకర్యాలను కూడా కల్పించాలని కాగ్ పేర్కొంది. దీనికి విరుద్ధంగా కొన్ని డిపోలలో దుప్పట్లు, పిల్లో కవర్లు, తువాళ్లు కొత్తవి సరఫరా చేసినా నెలల తరబడి వాటిని సంబంధిత డిపోలకు చేరవేయడం లేదు. ఈ వస్త్రాల కాల పరిమితి మొత్తం డిపోలలోనే గడిచిపోతోంది. రైల్వే శాఖ దుప్పట్లు, పిల్లో కవర్లు, తువాళ్లను ఎప్పటికప్పుడు శుభ్ర పరిచేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా నియమ నిబంధనలను కచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కాగ్ పేర్కొంది.