జాతీయ వార్తలు

సివిల్స్ టాపర్ టీనా దబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: సివిల్ సర్వీసెస్-2015 పరీక్షలో ఢిల్లీకి చెందిన టీనా దబి అనే యువతి టాప్ ర్యాంకును కైవసం చేసుకుని చాటుకుంది. మంగళవారం ప్రకటించిన ఈ ఫలితాల్లో జమ్మూ-కాశ్మీరుకు చెందిన రైల్వే అధికారి అథర్ అమీర్ యుఐ.షరీఫ్ ఖాన్ రెండో ర్యాంకును సాధించగా, ఢిల్లీకి చెందిన జస్మీత్ సింగ్ సంధు అనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి మూడో ర్యాంకును దక్కించుకున్నాడు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన టీనా దబి (22) తొలి ప్రయత్నంలోనే ఈ పరీక్షలో అత్యున్నత ర్యాంకును కైవసం చేసుకోవడం విశేషం. ఈ విజయం తనకు ఎంతో గర్వకారణమని ఆమె పేర్కొంది. కాగా, కాశ్మీరు దక్షిణ ప్రాంతంలోని అనంత్‌నాగ్‌కు చెందిన అథర్ (23)కు సివిల్స్‌లో రెండో ప్రయత్నంలో రెండో ర్యాంకు లభించింది. 2014లో తొలిసారి ఈ పరీక్ష రాసి ఐఆర్‌టిఎస్ (ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్)లో ఉద్యోగం పొందిన అతను ప్రస్తుతం లక్నోలోని ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందుతున్నాడు. ప్రస్తుతం సివిల్స్ పరీక్షలో రెండో ర్యాంకు లభించడంతో తన స్వప్నం సాకారమైందని, ప్రజల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అథర్ చెప్పాడు. సివిల్ సర్వీసులో జమ్మూ-కాశ్మీరు క్యాడర్‌ను ఎంచుకున్నానని, అక్కడ పనిచేసే అవకాశం లభిస్తే ఎంతో సంతోషిస్తానని, సొంత రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నానని ఆయన పిటిఐ వార్తా సంస్థతో అన్నాడు. ఇదిలావుంటే, మూడో ర్యాంకు సాధించడంలో తనకు చేయూత నిచ్చిన తల్లిదండ్రులు, అధ్యాపకులకు జస్మీత్ సింగ్ సంధు కృతజ్ఞతలు తెలిపాడు. జస్మీత్ తండ్రి న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఇకార్)లో పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు, మిత్రులతో పాటు తనకు కోచింగ్ ఇచ్చిన అధ్యాపకుడు ముకుల్ పాథక్ ప్రోద్బలం వల్లనే సివిల్స్ పరీక్షలో మూడో ర్యాంకు సాధించగలిగానని తెలిపాడు.

chitram సివిల్స్ -2015 పరీక్షల్లో జాతీయ స్థాయ ప్రథమ ర్యాంకు సాధించిన ఢిల్లీ యువతి టినా దబిని ముద్దాడుతున్న తల్లి