జాతీయ వార్తలు

ట్రాన్స్‌జండర్ల ముసాయిదా బిల్లులో అన్నీ లోపాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: ట్రాన్స్‌జండర్లకు వివాహం, విడాకులు తదితర హక్కులపై ఏర్పాటు చేసిన ప్రభుత్వ ట్రాన్స్‌జండర్ల రక్షణ, హక్కుల కల్పన ముసాయిదా బిల్లులో ఎన్నో లోపాలున్నాయని బిజెపి లోక్‌సభ సభ్యుడు రమేష్ బాయిస్ నేతృత్వంలోని ప్యానల్ విమర్శించింది. ట్రాన్స్‌జండర్లకు హక్కులు, సామాజిక న్యాయం, సాధికారతపై వేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికను లోక్‌సభకు సమర్పించింది. అయితే భాతర శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 ప్రకారం ప్రకృతి విరుద్ధమైన సెక్స్ నేరం, ఆవిధంగానే స్వలింగ సపర్కం కూడా నేరం. అయితే ఇటువంటి విషయంలో ట్రాన్స్‌జండర్లకు రక్షణ కల్పించేందుకు ముసాయిదా బిల్లు 2016లో ఎటువంటి ప్రతిపాదనలు లేవని రమేష్ పేర్కొన్నారు. ఎంతో మంది ట్రాన్స్‌జండర్లు కలిసి సహజీవనం (దాంపత్యం) చేస్తున్నారని అన్నారు. ట్రాన్స్‌జండర్లకు కల్పించాల్సిన హక్కులపై ముసాయిదా బిల్లులో ఎటువంటి ప్రస్తావన లేకపోవడం విచారకరమని అన్నారు. బిసిలకు కల్పిస్తున్నట్లు రిజర్వేషన్లు సౌకర్యం ట్రాన్స్‌జండర్లకు కూడా ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల విషయంపై కూడా ముసాయిదా బిల్లులో ఎటువంటి ప్రస్తావన లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ముసాయిదా బిల్లులో ట్రాన్స్‌జండర్ అంటే అటు ఆడ కాకుండా ఇటు మగ కాకుండా ఉండేవాళ్లని, పుట్టుకతో ఆడ, మగ అనే విషయంలో స్పష్టంగా లింగ నిర్ధారణ చేసేందుకు వీలులేని వారని నిర్వచించడంపై కూడా రమేష్ ఆక్షేపించారు. విదేశాల్లోలాగా ట్రాన్స్‌జండర్లకు కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని, వారిని కేవలం ఆడ, మగ, అటు ఇటుకాని వారిగా కాకుండా ప్రత్యేక గుర్తింపు కలిగేలా చేయాలని రమేష్ చెప్పారు. రాజ్యాంగంలోని 14, 19, 21 అధికరణల ప్రకారం సమాజంలో అందరితో సమానంగా హక్కులు కల్పించాలని అన్నారు. ఎంతోమంది ఆడ, మగగా గుర్తించే వీలులేకుండా పుడుతున్నారని, వారందరికీ సమాజంలో ఇతరుల్లా సమాన హక్కులు కల్పించాలని పేర్కొన్నారు. ముసాయిదా బిల్లులోని ఒకటవ అధ్యాయంలోని ట్రాన్స్‌జండర్ల నిర్వచనాన్ని మరింత విస్తృతస్థాయిలో పేర్కొనాలని సూచించారు. సమాజంలో ట్రాన్స్‌జండర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ముసాయిదా బిల్లులో ప్రస్తావించాలని తెలిపారు. సమాజంలో ట్రాన్స్‌జండర్లంటే వివక్ష, చిన్నచూపు లేకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.