జాతీయ వార్తలు

కలాం ఉన్న బంగళాలోనే ప్రణబ్ బస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: రాష్టప్రతిగా సోమవారం బాధ్యతలనుంచి తప్పుకోనున్న ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం చెప్పడానికి రాజాజీ మార్గ్‌లోని ఓ చరిత్రాత్మక భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. గతంలో మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం ఉన్న ఇంటినే ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీకి కేటాయించారు. సువిశాలమైన రాష్టప్రతి భవన్‌ను వదిలిపెట్టిన తర్వాత ప్రణబ్ రాజాజి మార్గ్‌లోని ఓ పాతకాలం నాటి విశాలమైన భవనంలోకి మారనున్నారు. రాష్టప్రతి పదవినుంచి తప్పుకొన్న తర్వాత అబ్దుల్ కలాం 2015లో మృతిచెందే వరకు ఇదే భవనంలో ఉన్నారు. కలాం మృతి తర్వాత దీన్ని కేంద్ర మంత్రి మహేశ్ శర్మకు కేటాయించారు. అయితే ఈ బంగళాను ప్రణబ్‌కు కేటాయించడంతో మహేశ్ దాన్ని ఖాళీ చేసి 10, అక్బర్ రోడ్డులోని ఇంటికి మారుతున్నారు. కాగా, ఈ ఇల్లు కొత్త రాష్టప్రతిగా ఎన్నికయిన రామ్‌నాథ్ కోవింద్‌కు తాత్కాలిక నివాసంగా ఉండడం గమనార్హం. రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటినుంచి కోవింద్ ఇదే ఇంట్లో ఉంటున్నారు. రాష్టప్రతి పదవినుంచి వైదొలగిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ రాష్టప్రతి భవన్‌నుంచి శర్మ ఖాళీ చేసిన భవనానికి మారుతూ ఉంటే ప్రస్తుతం శర్మకు కేటాయించిన ఇంటిలో ఉంటున్న కోవింద్ రాష్టప్రతి భవన్‌కు మారనుండడం విశేషం. గతవారం రాష్టప్రతి ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటినుంచి కోవింద్‌ను అనినందించడానికి వచ్చే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులతో 10, అక్బర్ రోడ్డు భవనం సందడి సందడిగా ఉంటోంది.
బ్రిటిష్ రాజ్యానికి రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దే సమయంలో నిర్మించిన ఈ రెండు బంగళాలు కూడా నిర్మాణ పరంగా ప్రత్యేకతలను కలిగి ఉండడం గమనార్హం. 11,776 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రాజాజీ మార్గ్‌లోని రెండంతస్థుల భవనంలో కింది భాగంలో ఒక లైబ్రరీ, ప్రణబ్ పుస్తకాభిలాషి అయిన ప్రణబ్ చదువుకోవడానికి ప్రత్యేక గది ఉన్నాయి. పదవీ విరమణ తర్వాత నిబంధనల ప్రకారం ప్రణబ్‌కు జీవించి ఉన్నంతకాలం ఉండడంకోసం బంగ్లాతో పాటుగా విద్యుత్, నీరులాంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నెలకు 75 వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది. దీనితోపాటు రెండు టెలిఫోన్లు, ఒక మొబైల్ ఫోన్ ప్రయాణించడానికి ఒక కారును కూడా ఇస్తారు. అంతేకాదు దేశంలో ఎక్కడికయినా ఆయన ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. వైద్య సదుపాయాలు సైతం ఉచితంగా అందిస్తారు. మాజీ రాష్టప్రతి సెక్యూరిటీని ఢిల్లీ పోలీసులు చూసుకుంటారు. రాజాజీ మార్గ్‌ను ఇంతకుముందు కింగ్ జార్జి అవెన్యూగా పిలిచేవారు. అయితే స్వాతంత్య్రం తర్వాత రాజాజీగా పిలవబడే భారత చిట్టచివరి గవర్నర్ జనరల్ అయిన సి రాజగోపాలాచారి గౌరవార్థం రాజాజీ మార్గ్‌గా పేరు మార్చారు.