జాతీయ వార్తలు

గోప్యతకు మారుపేరు ప్రణబ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ప్రణబ్ ముఖర్జీల మధ్య మాటలకందని సాన్నిహిత్యం ఉండేది. అది ఎంత సాన్నిహిత్యం అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారాన్నయినా ప్రణబ్ చెప్పకూడదని అనుకుంటే ఆయననుంచి దాన్ని రాబట్టడం ఎంతటి వారికయినా అసాధ్యమని ఇందిరాగాంధీ గట్టిగా నమ్మే వారు. ‘ఎవరెంతగా ప్రయత్నించినా ప్రణబ్‌నుంచి ఒక్క మాట కూడా బైటికి రాదు. వారికి కనిపించేదల్లా ఆయన పైప్‌నుంచి వచ్చే పొగమాత్రమే’ అని ఇందిరాగాంధీయే అనేక సందర్భాల్లో చెప్తూ ఉండేవారని 1985నుంచి ప్రణబ్‌కు మిత్రుడు, జర్నలిస్టు కూడా అయిన జయంత ఘోషల్ ఇందిరకు, ఆమె ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ప్రణబ్‌కు మధ్య ఉన్న నమ్మకాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పారు. 13వ రాష్టప్రతిగా సోమవారం రాష్టప్రతి భవన్‌ను వదిలిపెట్టబోతున్న నేపథ్యంలో ప్రణబ్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో చోటు చేసుకొన్న అనేక ముచ్చట్లను ఆయన సన్నిహిత మిత్రులు గుర్తు చేసుకున్నారు. ప్రణబ్ పైప్ కాల్చడం అంటే ఎంతో ఇష్టమని చెప్పిన ఘోషల్ ఆరోగ్య కారణాల దృష్ట్యా చాలా ఏళ్ల క్రితమే స్మోకింగ్ వదిలిపెట్టినప్పటికీ వట్టి పైప్‌ను నోట్లో పెట్టుకొని ఆ అనుభూతిని అనుభవించే వారని తెలిపారు. వివిధ దేశాధినేతలు, ప్రముఖులు కానుకగా ఇచ్చిన 500 పైపుల దాకా ప్రణబ్ వద్ద ఉండేవి. వాటన్నిటినీ ఆయన రాష్టప్రతి భవన్ మ్యూజియంకు విరాళంగా ఇచ్చేశారు.
1985లో బెంగాలీ దినపత్రికలో జూనియర్ రిపోర్టర్‌గా పని చేస్తున్న సమయంలో తాను మొదటిసారి ప్రణబ్‌ను దక్షిణ కోల్‌కతాలోని ఆయన నివాసంలో కలిసినట్లు ఆయన తెలిపారు. అప్పటినుంచి ప్రణబ్ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించినప్పుడల్లా ఆయన వెంటనే ఉండే వాడినని, రాజకీయాల గురించి ఆయన చెప్పే ఎన్నో విషయాలను ఓ విద్యార్థిలాగా వింటూ ఉండేవాడినని ఘోషల్ చెప్పారు.
ఇందిరాగాంధీ హత్య అనంతరం పార్టీలో నాయకత్వ పోరు ఉన్న రోజులను కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాజ్ పాటిల్ గుర్తు చేసుకుంటూ, ఈ దేశ రాజకీయాలు, ఆర్థిక విషయాలపై మంచి అవగాహన ఉన్న అతికొద్దిమంది నేతల్లో ప్రణబ్ ఒకరని అన్నారు. పార్లమెంటులో అత్యంత సీనియర్ సభ్యుల్లో ఆయన ఒకరని, ఒక మంత్రి ఎలా ప్రవర్తించాలో ఆయనకు బాగా తెలుసునని అన్నారు. ప్రభుత్వానికి సమస్యలు సృష్టించకుండా రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించాలో కూడా ఆయనకు బాగా తెలుసునని పాటిల్ అన్నారు. ప్రణబ్ ప్రతి ఒక్కరినీ ఎంతో ఆదరాభిమానాలతో చూసే వ్యక్తి అని, కష్టపడి పని చేసే వారని పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సౌగత రాయ్ అన్నారు. తాను కాంగ్రెస్‌నుంచి విడిపోయి చాలా ఏళ్లయినప్పటికీ ఆయన ఇప్పటికీ తనతో ఎంతో ప్రేమతో మాట్లాడుతుంటారని గుర్తు చేసుకున్నారు. కేంద్రంలో ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు లాంటి ఎన్నో కీలక శాఖలు నిర్వహించిన ప్రణబ్ కేంద్రంలో ఎప్పుడూ నంబర్ టూగానే ఉండిపోయారని, అయితే భారత రాష్టప్రతి కావడంతో ఆయన నంబర్ వన్ అయ్యేందుకు అవకాశం లభించిందని సౌగత రాయ్ అన్నారు.

చిత్రం.. ప్రణబ్‌కు పుష్పాన్ని అందిస్తున్న అనంతకుమార్