జాతీయ వార్తలు

దళితుడి ఇంట అమిత్ షా విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూలై 23: బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాజస్థాన్‌లో తన మూడు రోజుల పర్యటన చివరి రోజయిన ఆదివారంనాడు జైపూర్‌లో ఒక దళిత కుటుంబంతో కలిసి భోజనం చేశారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో పలు సమావేవాలు జరిపిన అనంతరం షా నగరంలోని సుశీల్‌పుర ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య బిజెపి యువమోర్చా సభ్యుడు రమేశ్ పచరియ ఇంట్లో భోజనం చేశారు. ముఖ్యమంత్రి వసుంధరా రాజె, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్నామి, ఎంపీ భూపేంద్ర యాదవ్‌లతో కలిసివచ్చిన అమిత్‌షాకు రమేశ్ కుటుంబ సభ్యులు రాజస్థానీ సంప్రదాయంలో ఘనంగా స్వాగతం పలికారు. రమేశ్ కుటుంబ సభ్యులు వారికి భోజనం వడ్డించగా వారంతా కిందనే కూర్చుని భోజనం చేశారు. పార్టీ అధ్యక్షుడికోసం తన అమ్మ పప్పు, అన్నం, చపాతి, హల్వా, ఖీర్ (పాయసం) వండిందని పచరియ చెప్పారు. అమిత్ షా రావడానికి ముందు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించడానికి పార్టీ నేతలు చాలాసార్లు అక్కడికి వచ్చారు. పార్టీకోసం రమేశ్ పచరియ చురుగ్గా పని చేయడాన్ని బట్టే అతని ఇంటిని ఎంపిక చేశామే తప్ప కులం, వర్గం ఆధారంగా ఎంపిక చేయలేదని రాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి అరుణ్ చతుర్వేది చెప్పారు.
నగరం మధ్యలో ఇరుకైన వీధులతో ఉండే సుశీల్‌పుర ప్రాంతానికి ఒక వివిఐపి రావడం ఇదే మొదటిసారి కావడంతో పెద్దసంఖ్యలో జనం అమిత్ షాను చూసేందుకు అక్కడికి చేరారు. చాలామంది ఇళ్లపైకి ఎక్కి ఆయనను చూశారు. దాదాపు అరగంట సేపు రమేశ్ పచరియ ఇంట్లో గడిపిన అమిత్ షా ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఆయన ఇంటి బయట స్థానికులను కలిసిన అమిత్ షా ఇళ్లపై ఉన్న జనంవైపు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్, ఎంపీలు భూపేంద్ర యాదవ్, నిహాల్ చంద్ మేఘ్వాల్ , రాష్ట్ర మంత్రి అరుణ్ చతుర్వేది ఇతర నాయకులు అమిత్ షా వెంట ఉన్నారు. వచ్చే ఏడాది రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

చిత్రం.. దళితుని ఇంట్లో భోజనం చేస్తున్న అమిత్ షా, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె