జాతీయ వార్తలు

పార్టీ పదవినుంచి వినె్సంట్ తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జూలై 23: కేరళలో అత్యాచారం ఆరోపణలపై అరెస్టయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం వినె్సంట్‌ను పార్టీ పదవినుంచి రాష్ట్ర కాంగ్రెస్ తొలగించింది. వినె్సంట్‌పై అత్యాచారం కేసు, ఆయన అరెస్టు రెండూ కూడా రాజకీయ దురుద్దేశంతో జరిపినవే అయినప్పటికీ మహిళ ఫిర్యాదు దృష్ట్యా ఆయనను పార్టీ కార్యదర్శి పదవినుంచి తొలగించాలని నిర్ణయించినట్లు కేరళ పిసిసి అధ్యక్షుడు ఎంఎం హసన్ ఆదివారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. ఈ కేసులో వినె్సంట్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే వరకు ఆయన పార్టీ పదవికి దూరంగా ఉంటారని హసన్ చెప్పారు.
కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలనన్న నమ్మకం ఉందని వినె్సంట్ పార్టీకి చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా, వినె్సంట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న సిపిఎం డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చుతూ, కోర్టు గనుక ఆయనను దోషిగా నిర్ధారిస్తే అప్పుడు పార్టీ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు.