జాతీయ వార్తలు

బిజెపికి కొత్త శక్తినిచ్చిన బెంగాల్, త్రిపుర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: బిజెపి విస్తరణ అజెండాలో అగ్రభాగాన ఉన్న పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో రాష్టప్రతి ఎన్నికల్లో ఓటింగ్ తీరు ఆ పార్టీ వ్యూహకర్తలకు ఆనందాన్ని కలిగిస్తోంది. బెంగాల్‌లో బిజెపికి ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు 11 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. అలాగే త్రిపురలో బిజెపి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోయినప్పటికీ రాష్టప్రతి ఎన్నికల్లో కోవింద్‌కు ఏడు ఓట్లు రావడం మంచి పరిణామంగా పార్టీ భావిస్తోంది. ‘పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మమతా బెనర్జీ, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు బిజెపి ప్రధాన ప్రత్యర్థిగా మారుతోందని ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా భావిస్తున్నారు’ అని పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాష్టప్రతి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో పది ఓట్లు చెల్లలేదు. ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌ను సమర్థించాలన్న ఇతర పార్టీల అధికారిక వైఖరిని ఆ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా ఇష్టపడలేదనే దానికి ఇది నిదర్శనంగా బిజెపి భావిస్తోంది. 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బిజెపి, దాని మిత్రపక్షాలకు ఆరుగురు ఎమ్మెల్యేలున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలను వెనక్కి నెట్టి ఆ స్థానానికి చేరుకోవడానికి అమిత్ షా నేతృత్వంలోని బిజెపి సర్వశక్తులనూ ఒడ్డి ప్రయత్నిస్తోంది. బిజెపి పట్ల జనం పెద్దఎత్తున ఆకర్షితులవుతున్నారని, రాబోయే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు, బిజెపి మధ్యనే పోటీ ఉంటుందని ఘోష్ అంటున్నారు.
ఇక త్రిపురలో బిజెపికి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అయితే జాతీయ స్థాయిలో బిజెపిని ఎదుర్కోవడానికి తృణమూల్ కాంగ్రెస్ వామపక్షాలకు చేరువ అవుతూ ఉండడంతో గతంలో కాంగ్రెస్‌నుంచి టిఎంసికి ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలు బిజెపిలోకి ఫిరాయించారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా తయారయిందని, 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 25 ఏళ్లుగా కొనసాగుతున్న వామపక్షాల పాలనకు చరమగీతం పాడడానికి ప్రధాన పోటీదారుగా ఉంటుందని బిజెపి నేతలు భావిస్తున్నారు. అయితే బిజెపి, త్రిపుర రాష్ట్రాలు బిజెపి నేతలకు సంతోషాన్ని తెచ్చిపెట్టగా ఆ పార్టీ విస్తరణ అజెండాలో అగ్రభాగాన ఉన్న మరో రాష్ట్రం కేరళలో మాత్రం దానికి అసంతృప్తే మిగిలింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రాష్టప్రతి ఎన్నికల్లో కేరళలో ఆ పార్టీ ఇతర పార్టీలకు చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా ఆకర్షించలేకపోయింది. రాష్ట్రంనుంచి కోవింద్‌కు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే అయిన ఓ. రాజగోపాల్ ఓటు మాత్రమే దక్కింది.