జాతీయ వార్తలు

సరిహద్దు అవుట్ పోస్టులకు పైపులద్వారా మంచినీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: అత్యంత సంక్లిష్టమైన హిమాలయాల్లోని మారుమూల మంచు పర్వతాలు, థార్ ఎడారి, దుర్గమమైన ఈశాన్య రాష్ట్రాలు.. ఇలా సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉండే జవాన్లకు పైపుల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తోంది. తాగునీరు, శానిటేషన్ మంత్రిత్వ శాఖ సహకారంతో హోం శాఖ ఈ ప్రణాళికను అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టు అమలుకు రూ.6వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. హోం మంత్రిత్వ శాఖ నిధులను అందిస్తే, తాగునీరు, శానిటేషన్ మంత్రిత్వ శాఖ సాంకేతిక సహాయాన్ని అందజేస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో సంబంధిత ఏజన్సీల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తాయి. ఈ ప్రాజెక్టు కింద పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్ సరిహద్దుల వెంబడి ఉండే సరిహద్దు అవుట్ పోస్టులకు పైపులద్వారా మంచినీరును సరఫరా చేస్తారు. ఈ సరిహద్దులను బిఎస్‌ఎఫ్, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు (ఐటిబిపి), సశస్త్ర సీమాబల్ లాంటి పారా మిలటరీ బలగాలు కాపలా కాస్తున్న విషయం తెలిసిందే. ఐటిబిపి కాపలా కాస్తున్న సరిహద్దు అవుట్‌పోస్టులు సముద్ర మట్టంనుంచి 9 వేలనుంచి 18,700 అడుగుల ఎత్తులో ఉన్నాయి. దుర్గమమైన ఈ పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వీరికి జలపాతాలు, బోరుబావులు, ట్యాంకర్లు లాంటివే తాగునీటికి ఆధారాలు. మారుమూల, దుర్గమమైన ప్రాంతాలకు నీటిని మోసుకెళ్లడం చాలా కష్టమైన పని కావడంతో కొన్ని ప్రాంతాల్లో స్థానిక కమాండర్లు నీళ్లు తీసుకు రావడానికి పోర్టర్లను నియమించుకుంటున్నారు. జమ్మూ, కాశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఈ సరిహద్దు ఔట్‌పోస్టులున్నాయి.