జాతీయ వార్తలు

హింస వద్దు.. చర్చ ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: భిన్న భావనలతో కూడిన చర్చలను శాంతియుతంగా సంయమనంతో నిర్వహించాల్సిన అవసరం ఉందని, వౌఖికంగా కానీ, శారీరకంగా కానీ హింసాత్మక ధోరణులు ఎంతమాత్రం తగవని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. భారత రాష్టప్రతిగా సోమవారం జాతినుద్దేశించి చివరిసారిగా ప్రసంగించిన ఆయన ‘‘్భరత దేశ శక్తి దాని సహనశీలతలోనే ఉంది’’ అని ఉద్ఘాటించారు. భిన్నత్వంలోనే ఏకత్వ భావనను మరింత పటిష్ఠపరచుకుంటే సహనం, సంయమనం గీటురాళ్లుగా భారతావని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారత నాగరికతకు సహనశీలత, కరుణ, సంఘీభావమే పునాదులని స్పష్టం చేశారు. కానీ, ప్రతిరోజూ మన చుట్టూ ఎన్నో హింసాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఇందుకు కారణం భయం అపనమ్మకం భావ శూన్యతేనని తెలిపారు. ఈరకమైన ధోరణులను విడనాడి ప్రజాసమస్యలపై స్వేచ్ఛాయుత రీతిలో చర్చ జరగాలని అన్నారు. మంగళవారం రాష్టప్రతిగా పదవీ విరమణ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ అహింసాయుత సమాజమే అన్ని వర్గాల ప్రజల మధ్య శాంతి సంయమనం, భాగస్వామ్య భావనను పాదుగొల్పగలుగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య పథంలో భారతావని ముందుకు సాగాలంటే అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకోవలసిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. శాంతి కాముకత, సహనశీలత ఆదరణ భావంతో కూడిన సమాజాన్ని నిర్మించాలంటే అహింస శక్తిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. భారతీయత అన్నది భిన్నత్వంలోనూ కనికరం సహనశీలతలోనే ఉందని స్పష్టం చేసిన ఆయన ‘‘్భరత దేశం కేవలం భౌతికపరమైన రూపమే కాదని ఇందులో ఆలోచనలు, తత్వం, మేధో సంపత్తి, శ్రమించే గుణం, తెలివితేటలు, వినూత్నంగా ఆలోచించే లక్షణం, అనుభవం నిబిడీకృతం అయి ఉన్నాయని తెలిపారు. భారత చరిత్ర వీటన్నింటి సమాహారమేనని 81సంవత్సరాల ప్రణబ్ విశే్లషించారు. భిన్నత్వం అన్నది భిన్న ఆలోచనలు అవగతం చేసుకోవటం ద్వారా సాగిన శతాబ్దాల ప్రయత్నం ద్వారా సాధించుకున్నదని తెలిపారు. భారత దేశ ప్రత్యేకతకు కారణం సంస్కృతి, మత విశ్వాసాలు, భాషాపరమైన వైవిధ్యాలున్నా, ఒకే తాటిపై ముందుకు సాగడమేనని వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై జరిగే చర్చల్లో భిన్న వాదనలు సహజంగానే ఉంటాయని పేర్కొన్న ఆయన ‘‘మన వాదనను మనం వినిపించొచ్చు. ఎదుటి వారి వాదనతో ఏకీభవించకపోవచ్చు. అయితే భిన్న భావనల ప్రాధాన్యతను నిరాకరించటానికి వీల్లేదు’’ అని తెలిపారు. ఇందుకు ఏమాత్రం భిన్నంగా వ్యవహరించినా మన ఆలోచనా ప్రక్రియలో అత్యంత మూలమైన పునాదులే కదిలిపోతాయని హెచ్చరించారు. పేదరిక నిర్మూలన ద్వారానే ప్రతి ఒక్కరిలోనూ ఆనందాన్ని నింపవచ్చని పేర్కొన్న ప్రణబ్ ఆనందకరమైన జీవితాన్ని కోరుకునే హక్కు ప్రజలకు ఉందని ఉద్ఘాటించారు. భారతీయ విద్యావ్యవస్థ ఆధునికతను సంతరించుకుని పరిశోధనాభావంతో ముందుకు సాగాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరిలోనూ శాస్ర్తియ దృక్పథాన్ని పెంపొందించేందుకు వర్శిటీలు కృషి చేయాలన్నారు. సాంఘికంగా ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసినప్పుడే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయన్నారు. సుపరిపాలన ద్వారానే ప్రజలు తమ జీవితాలను తీర్చిదిద్దుకోగలుగుతారని, ఇందులో భాగంగా పారదర్శకత, జవాబుదారీతనం, భాగస్వామ్య భావనలతో కూడిన రాజకీయ వ్యవస్థలను పటిష్ఠపరచాలన్నారు. ‘‘్భవిష్యత్తు కోసం మనమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.’’ అని అన్నారు.