జాతీయ వార్తలు

ఉత్తమ సేవలందిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 10: యుపిఎస్‌సి పరీక్షల్లో 14వ ర్యాంకు సాధించిన తెలుగుతేజం సిహెచ్.కీర్తి ప్రజలకు చేరువగా సేవలందించాలన్న లక్ష్యాన్ని చేరుకుంది. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగంలో చేరిన కీర్తి రెండో ప్రయత్నంలో తన చిరకాల వాంఛ తీర్చుకుంది. ‘ఐఎఎస్‌గా బాధ్యతలు కత్తిమీద సాము. రాజకీయ జోక్యంతో పాటు ఒత్తిడి అధికం. నువ్వు తట్టుకోలేవు’ అని తల్లిదండ్రులు తొలుత అభ్యంతరం చెప్పినా తాను సాధించాలనుకున్న లక్ష్యం వైపే సాగింది. దీంతో తల్లిదండ్రులు తమ కుమార్తెకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. సివిల్స్ రాసిన తొలి ప్రయత్నంలో దక్కిన ర్యాంకుతో హైదరాబాద్‌లో సెంట్రల్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న కొద్ది గంటల్లోనే అంతకంటే మంచి ర్యాంక్ వచ్చినట్లు యుపిఎస్‌సి ప్రకటించడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవడం కీర్తి వంతైంది. కీర్తి స్వస్థలం విశాఖ అయినప్పటికీ టెన్త్ నుంచి చదువుసంధ్యలన్నీ హైదరాబాద్, చెన్నైల్లో సాగాయి. చెన్నై ఐఐటిలో మెటలర్జీ విభాగంలో ఇంజినీరింగ్ 2008లో పూర్తి చేసి బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచారు. చెన్నైలో చదువుతుండగా తమిళనాడుకు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి నేతృత్వంలో కేంపస్‌లో నిర్వహించిన కెరీర్ కౌనె్సలింగ్ కీర్తి జీవితాన్ని మలుపుతిప్పిందనే చెప్పాలి. అప్పటి వరకూ ఉపాధి కోసం ఉద్యోగం అని భావించిన కీర్తి సీనియర్ ఐఎఎస్ వ్యాఖ్యలతో తన భవిష్యత్ జీవిత మార్గాన్ని ఎంచుకుంది. ఇంజినీర్‌గా కొనసాగడం కన్నా, ప్రజలకు సేవ చేయాలన్న ఆమె ఆలోచనకు ఈ కౌనె్సలింగ్ సమావేశం దోహదపడింది. ఐఎఎస్ అధికారి ప్రసంగం ఆమెను యుపిఎస్‌సి పరీక్షకు హాజరయ్యేలా చేసింది. రెండు సార్లు పరీక్ష రాశారు. అందులో ఆమెకు 440, 512 ర్యాంక్‌లు లభించాయి. రెండుసార్లు రాసినప్పుడు ఎక్కువ ర్యాంక్ రావడంతో కష్టపడి చదివి మూడవసారి 14వ ర్యాంకు సాధించగలిగానని ఆమె తెలిపారు. మెరుగైన ర్యాంక్ సాధనలో వెనుకబడటానికి గల కారణాలను నిశితంగా విశే్లషించానని తెలిపారు. తాను రాసిన సమాధానాలు దిద్దేవారికి నచ్చకపోవడమే కారణమని గుర్తించి ఆ దిశగా మెరుగులు దిద్దుకున్నానని చెప్పారు. లక్షలాది మంది రాసే ఈ పరీక్షలో సమాధానాలు జవాబు పత్రాలు దిద్దేవారికి ఆసక్తి కల్గించేలా లేదా చదివించేలా ఉండాలని సూచించారు. ఐఎఎస్‌లో అద్భుత ఫలితాన్ని సాధించిన కీర్తి తండ్రి నరేంద్ర ఫార్మసీ రంగంలో ఉన్నారు. తల్లి పద్మ గృహిణి.

chitram కీర్తి (సివిల్ స 14వ ర్యాంకర్)