జాతీయ వార్తలు

త్వరలోనే వెయ్యి కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: పోలవరం ప్రాజెక్టును సమర్థంగా, త్వరితగతిన పూర్తి చేసేందుకే నిర్మాణ పనులను రాష్ట్రానికే అప్పగించాం. ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కాలేదు. మరో 15, 20 రోజుల్లో వెయ్యి కోట్లు కేంద్రం విడుదల చేయనుంది’ అని కేంద్ర జలవనరుల సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ బల్యాన్ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెవిపి రామచంద్రరావు అడిగిన మూల ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పోలవరానికి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్స్‌ను ప్రభుత్వం ఇంకా పంపలేదు. ప్రభుత్వం పంపించగానే అవసరమైన చర్యలు తీసుకుంటాం. 2014 ధరల ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్‌కు నిధులు విడుదల చేస్తాం’ అని వివరించారు. నీతి ఆయోగ్ నిర్ణయం మేరకే పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామన్నారు. అయితే, ఇందుకోసం చట్ట సవరణ అవసరం లేదన్నారు. మంత్రి తప్పుడు సమాచారం ఇస్తున్నారని సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌తోపాటు పలువురు బిజెడి సభ్యులు ఆరోపించటంతో, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ జోక్యం చేసుకుంటూ సమాధానం సక్రమంగా లేకుంటే సభా నియమాల ప్రకారం చర్య తీసుకోవచ్చని సలహా ఇచ్చారు.
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించేందుకు ఉద్దేశించిన పోలవరం శంఖుస్థాపనను 1981లో అప్పటి సిఎం టి అంజయ్య చేశారని రామచంద్రరావు గుర్తు చేశారు. ఆంధ్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం తీసుకోకుండానే హెడ్ వర్క్స్, స్పిల్ వే వర్క్స్, కుడి ఎడమ కాల్వల నిర్మాణానికి అనుమతులు మజూరు చేసిందా? అని ప్రశ్నించారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ రాకుండా అనుమతులెలా ఇస్తారని నిలదీశారు. దీనికి మంత్రి సంజీవ్‌కుమార్ బల్యాన్ బదులిస్తూ 2011-12 లెక్కల ప్రకారం ప్రాజెక్టు మొత్తం ఖర్చు 16,010 కోట్లు, అయితే 2014 వరకు జరిగిన ఖర్చుకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్స్‌ను రాష్ట్రం ఇంకా పంపలేదన్నారు. పోలవరం నిర్మాణం కోసం 2014 వరకు అయ్యే ఖర్చును నూటికి నూరుశాతం కేంద్రం భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం 2014 నుంచి ఇంతవరకు 3,364 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. ప్రాజెక్టుపై ఇంతవరకు చేసిన మొత్తం ఖర్చు 5,736 కోట్ల రూపాయలని చెబుతూ, కేంద్రం మరో పదిహేను ఇరవై రోజుల్లో వెయ్యి కోట్లు రాష్ట్రానికి విడుదల చేయనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 95 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనికోసం 9,866 కోట్లు అవసరమవుతాయి అని వివరించారు. రాష్ట్రం పంపించే రివైజ్డ్ ఎస్టిమేట్స్‌కు 2014 ధరల ప్రకారం చెల్లిస్తామని బల్యాన్ స్పష్టం చేశారు. ఇంతలో బిజెపి సభ్యుడు నరేంద్రకుమార్ మాట్లాడుతూ పోలవరం అంశం కోర్టు పరిశీలనలో ఉన్నదన్నారు. ఒడిశా ప్రయోజనాలను విస్మరిస్తున్నారని అనుభవ్ మోహంతీ విమర్శించారు. దీనికి మంత్రి బదులిస్తూ పోలవరం నిర్మాణంపై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని, నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ప్రకటించారు. ఎంబాక్‌మెంట్ నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం ఎంబాక్‌మెంట్ నిర్మాణం జరుగుతోంది. దీనికయ్యే పూర్తి ఖర్చును కేంద్రం భరిస్తుందని బిజెడి సభ్యులకు హామీ ఇచ్చారు. వైకాపా సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు ఎంతమంది గిరిజన కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించారని ప్రశ్నించారు. ఎన్ని గిరిజన కుటుంబాలకు భూమికి బదుల భూమి ఇచ్చారు, ఉపాధి కల్పించారంటూ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 28,757 కుటుంబాలకు చెందిన 1,07,551 మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. ఇంతవరకు 3,052 మందిని ఇతర ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పునరావాస పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణాన్ని కేంద్రం చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకిచ్చారు? నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి ఇచ్చేందుకు చట్టాన్ని సవరించారా? అని సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించగా బల్యాన్ బదులిస్తూ పోలవరం నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందనటం నిజం కాదన్నారు. నీతి ఆయోగ్ నిర్ణయం మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకే రాష్ట్రానికి అప్పగించామన్నారు. దీనికోసం చట్ట సవరణ అవసరం లేదన్నారు. చట్ట ప్రకారం పోలవరాన్ని కేంద్రం చేపట్టినప్పుడు, దాన్ని సవరించకుండా నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారని దిగ్విజయ్ మంత్రిని నిలదీశారు.

చిత్రం.. రాజ్యసభలో మాట్లాడుతున్న దిగ్విజయ్‌సింగ్