జాతీయ వార్తలు

భారత అంతరిక్ష పరిశోధనలకు మార్గదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 24: అంతరిక్ష ప్రయోగాలలో భారత్‌ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన మార్గదర్శి, దార్శనికుడు ఉడిపి రామచంద్రారావు (యుఆర్‌రావు). ప్రపంచ దేశాల సరసన అంతరిక్ష పరిశోధనల్లో మనదేశం సగర్వంగా తలెత్తుకు నిలిచేలా చేసిన ఘనత యుఆర్‌రావుకే దక్కుతుంది. అంతరిక్ష ప్రయోగాలలో అంతర్జాతీయంగా తనకంటూ ఓ ప్రత్యేకతను యుఆర్‌రావు చాటుకున్నారు. స్పేస్ టెక్నాలజీ రంగంలో దేశం అభివృద్ధి సాధించడానికి ఆయన చేసిన కృషి అమోఘం. దశాబ్దాలుగా దేశ అంతరిక్ష రంగంలో వచ్చిన అనేక మార్పులకు ఆయన ఆద్యుడు. ఈ రంగంలో శాస్తవ్రేత్తలకు, సాంకేతిక నిపుణులకు ఆయన ఓ అనుసంధానకర్తగా నిలిచారు. ఇస్రో ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని ప్రయోగాలలో యుఆర్‌రావు ఏదో ఒక హోదాలో సేవలందించారు. 1975లో భారత్ ప్రయోగించిన మొదటి అంతరిక్ష నౌక ఆర్యభట్ట నుంచి చంద్రయాన్-1, మంగళయాన్ మిషన్ వరకు యుఆర్‌రావు ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలందించారు. సూర్యగ్రహ యానానికి సిద్ధం చేస్తున్న ఆదిత్య మిషన్‌కు కూడా యుఆర్‌రావు తన సలహాలు, సూచనలు అందించారు. లక్ష్మీనారాయణ ఆచార్య, కృష్ణవేణమ్మ దంపతులకు కర్నాటకలోని ఉడిపి జిల్లా అడమారులో 1932, మార్చిలో యుఆర్‌రావు జన్మించారు. ఉడిపిలోనే పాఠశాల విద్య, బల్లారిలో ఇంటర్, అనంతపూర్‌లో బిఎస్‌సి చదివారు. బనారస్ హిందు యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, అహ్మదాబాద్‌లో భారత అంతరిక్ష పరిశోధనలకు పితామహుడిగా పేరొందిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మార్గదర్శకత్వంలో పిహెచ్‌డి పూర్చి చేశారు. అనంతరం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ మెంబర్‌గా పనిచేశారు. దల్లాస్‌లోని టెక్సాస్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అక్కడ అంతరిక్ష నౌకలపై పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. 1966లో యుఆర్‌రావు భారత్‌కు తిరిగి వచ్చారు. ఫిజికల్ రిసెర్చ్ లేబొరేటరీలో సారాభాయ్‌తో కలిసి పనిచేశారు. 1972లో భారత్‌లో శాటిలైట్ టెక్నాలజీ రంగాభివృద్ధికి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. యుఆర్‌రావు మార్గదర్శకత్వంలోనే భారత మొదటి అంతరిక్ష నౌక ఆర్యభట్టను ప్రయోగించారు. 1984లో అప్పటి వరకు స్పేస్ కమిషన్‌కు చైర్మన్‌గా ఉన్న సతీష్ ధావన్ నుంచి యుఆర్‌రావు బాధ్యతలు చేపట్టారు. ఇస్రో చైర్మన్‌గా పది సంవత్సరాల పాటు సేవలందించారు. యుఆర్‌రావు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత అంతరిక్ష పరిశోధనా రంగం వేగంగా అభివృద్ధి సాధించింది. రెండు టన్నుల బరువుగల శాటిలైట్లను అంతరిక్షంలోకి చేరవేయగల సామర్థ్యం గల రాకెట్లను కూడా రూపొందించడంలో భారత్ విజయం సాధించింది. కాస్మిక్ రేస్, ఇంటర్‌ప్లానటరీ ఫిజిక్స్, హై ఎనర్జీ ఆస్ట్రోనమీ, శాటిలైట్, రాకెట్ టెక్నాలజీ తదితర అంశాలపై 350కి పైగా వ్యాసాలు, అనేక పుస్తకాలు యుఆర్‌రావు రాసారు. వాషింగ్టన్‌లోని ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’లో, మెక్సికోలోని ‘ఐఏఎఫ్ హాల్ ఆఫ్ ఫేమ్’లో గుర్తింపు పొందిన మొదటి భారతీయ శాస్తవ్రేత్తగా యుఆర్‌రావు ఘనత వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడడం అంటే యుఆర్‌రావుకు ఎంతో ఇష్టం.