జాతీయ వార్తలు

తెలంగాణ సర్కార్ పన్ను రాయితీ ఇచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ తాను, తన కుటుంబ సభ్యులపై చేసిన నాలుగు ఆరోపణలను బిజెపి ఉపరాష్టప్రతి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణా ప్రభుత్వం తన కూతురుకు సంబంధించిన స్వర్ణ భారతి ట్రస్ట్‌తోపాటు పలు ఇతర సంస్థలు హైదరాబాదు మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ బోర్డుకు చెల్లించవలసిన పన్నులను రద్దు చేసిందని ఆయన చెప్పారు. స్వర్ణ్భారతితో పాటు పలు ఇతర సంస్థలకు కూడా పన్ను చెల్లింపుల నుండి మినహాయింపు ఇచ్చినట్లు తెలంగాణా ప్రభుత్వం ఈనెల 23వ తేదీ వివరణ ఇచ్చిందని వెంకయ్యనాయుడు చెప్పారు. వివిధ సంస్థలకు మినహాయింపు ఇచ్చే అధికారం తమ ప్రభుత్వానికి ఉన్నదని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిందని ఆయన చెప్పారు. స్వర్ణ భారతి ట్రస్ట్ లాభాపేక్షలేని సంస్థ, సమాజసేవ చేసే సంస్థ కాబట్టే పన్ను చెల్లింపుల నుండి మినహాయింపు ఇచ్చినట్లు తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన వివరణను విస్మరించరాదన్నారు. తన పిల్లలు చేసే వ్యాపారంతో తనకు ఎప్పుడు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘‘జయరాం రమేష్ చేసిన ఆరోపణలోని నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాను, తెలంగాణ ప్రభుత్వం వాహనాల కొనుగోలుతో తన కుమారుడి సంస్థకు ఎలాంటి సంబంధం లేద’’ని వెంకయ్యనాయుడు వివరించారు. తెలంగాణా ప్రభుత్వం నేరుగా టొయోటా కిర్లోస్కర్ సంస్థతో లావాదేవీలు జరిపి, చెల్లింపులు కూడా వారికే చేసి వాహనా కొనుగోలు చేసిందన్నారు. డిజిఎస్ అండ్ డి ఉత్పత్తిదారులతో రేట్ కాంట్రాక్ట్‌ను ఖరారు చేసిందని వెంకయ్యనాయుడు వివరించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడి హోదాలో కుశాభావ్ థాక్రే ట్రస్ట్ అధ్యక్షుడుగా పనిచేశానని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దీంతో పాటు ఇతర ట్రస్ట్‌లకు కూడా భూమి కేటాయించినట్లు వెంకయ్య తెలిపారు. నెల్లూరు భూముల గురించి 2002లోనే స్థానిక కాంగ్రెస్ నాయకులు లేవనెత్తారని, కోర్టుకు కూడా వెళ్లారని, అయితే భూ ఆక్రమణ కేసును కోర్టు కొట్టి వేసిందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఉపరాష్టప్రతి ఎన్నికకు కొన్ని రోజుల ముందు ఈ ఆరోపణలను చేస్తున్నారంటే వారి రాజకీయ దురుద్దేశం ఏమిటనేది అర్థమవుతుందని వెంకయ్యనాయుడు తెలిపారు.