జాతీయ వార్తలు

విజయవాడ రామకృష్ణకు 84వ ర్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 10: ఎప్పటికైనా ఐఎఎస్ అధికారి కావాలనే పట్టుదలతో మూడేళ్లుగా సివిల్స్ పరీక్ష రాస్తూ వచ్చిన విజయవాడ ముత్యాలంపాడు నివాసి చిట్టూరి రామకృష్ణ మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 84వ ర్యాంక్ సాధించారు. 2013లో జరిగిన పరీక్షలో ఐపిఎస్‌కు, 2014లో జరిగిన పరీక్షలో ఐఆర్‌ఎస్‌కు అర్హత సాధించగా ఈ దఫా ఐఎఎస్‌కు ఎంపికై తన కోరిక నెరవేర్చుకున్నారు. వీరి తండ్రి అన్నవరప్రసాద్ విజయవాడ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. తల్లి లక్ష్మీభాయి. ఇక రామకృష్ణ సత్యనారాయణపురం అమలీ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో ప్రాథమిక విద్య, తార్నాకలోని రైల్వే కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. సివిల్స్‌లో ఉన్నత ర్యాంక్ సాధించిన రామకృష్ణను రైల్వే అధికారులు, ఉద్యోగులు అభినందించారు.
విశాఖ డాక్టరుకు 318 ర్యాంక్
విశాఖకు చెందిన జి.సుధీర్‌కు యుపిఎస్‌సి ఫలితాల్లో 318 ర్యాంక్ లభించింది. శ్రీకాకుళం జిల్లా పురుషోత్తమ పురానికి చెందిని ఆయన కుటుంబం విశాఖలో స్థిరపడింది. మచిలీపట్నం, కాకినాడలో పాఠశాల విద్య అభ్యసించారు. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రావడంతో విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ చదివారు. మూడో ప్రయత్నంలో ఈ ర్యాంక్ దక్కించుకున్నారు.
సివిల్స్‌లో సీమ రత్నాలు
కర్నూలు/పుట్టపర్తి: సివిల్ సర్వీసెస్‌లో రాయలసీమ విద్యార్థినులు సత్తా చాటారు. కర్నూలు యువతి వల్లూరు క్రాంతి సివిల్ సర్వీసెస్‌లో జాతీయ స్థాయిలో 65వ ర్యాంకు సాధించింది. అదే విధంగా అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి గ్రామానికి చెందిన ప్రావీణ్య ఐఏఎస్‌లో ఆలిండియా 82వ ర్యాంకు సాధించింది. కర్నూలు నగరంలో ప్రముఖ వైద్యుడైన డాక్టర్ వెంకట రంగారెడ్డి కుమార్తె క్రాంతి రెండవ ప్రయత్నంలో జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి జిల్లా కీర్తిని చాటారు. మహారాష్టల్రోని నాగపూర్‌లో సహాయ ఆదాయ పన్ను కమిషనర్‌గా శిక్షణ పొందుతున్న ఆమె మంగళవారం ఆంధ్రభూమితో మాట్లాడుతూ ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించడానికి సరైన మార్గం సివిల్స్ ద్వారా సాధ్యమని అందులో ఐఎఎస్ కావడమే లక్ష్యంగా చదివానని తెలిపారు. బెంగుళూరులో హెచ్‌ఏఎల్‌లో చీఫ్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రావీణ్య 82వ ర్యాంకును సాధించింది. కాగా కర్నూలు జిల్లా ఆత్మకూరు యువకుడు యన్నం విజయసింహారెడ్డికి సివిల్స్‌లో 588వ ర్యాంకు వచ్చింది.

chitram చిట్టూరి రామకృష్ణ