జాతీయ వార్తలు

ఆ దాడి లష్కరే పనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 24: అమర్‌నాధ్ యాత్రపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ మిలిటెంట్లకు సహాయపడిందని, దాడికి సంబంధించి వ్యూహరచన ఆ సంస్థపనేనని సోమవారం పోలీసులు వెల్లడించారు. జూలై 10న అమర్‌నాథ్ యాత్రపై జరిగిన ఉగ్రదాడిలో ఎనిమిది మంది మృతి చెందారు. కేసు దర్యాప్తునకు సంబంధించి మరిన్ని వివరాలను కాశ్మీర్ ఇన్స్‌పెక్టర్ జనరల్ మునీర్‌ఖాన్ మీడియాకు వెల్లడించారు. ‘లష్కరేకు చెందిన పాకిస్తాన్ మిలిటెంట్ అబూ ఇస్మాయిల్, మరొక ఉగ్రవాది స్థానిక మిలిటెంట్లకు సహాయపడ్డారు’అని ఐజి తెలిపారు. దాడికి వ్యూహరచన చేసింది లష్కరేనని దర్యాప్తులో తేలినట్టు ఆయన చెప్పారు. స్థానిక లష్కరే మిలిటెంట్లు జిబ్రాన్, సాద్‌లే దాడికి పాల్పడ్డారన్న ఖాన్’ ఈనెల 17న బ్రాగ్‌పొరలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఈ ఇద్దరూ మరణించారు’అని వెల్లడించారు. అలాగే దాడికి సంబంధించి మరెవరిదైనా పాత్ర ఉందా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోందని ఐజి పేర్కొన్నారు.