జాతీయ వార్తలు

హోం సిగ్నల్‌ను ఢీకొన్న రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూలై 24: మండలంలోని చీకురాయి గ్రామం వద్ద ఇనుప సామాగ్రితో కాజీపేట వైపు వెళ్తున్న గూడ్స్ రైలు 38 గేట్ హోం సిగ్నల్‌ను సోమవారం ఢీకొట్టింది. దీంతో ఆ సిగ్నల్ విరిగి పడగా, రైల్వే విద్యుత్ స్తంభాలు వంగి పోయ కాజీపేట-బల్లార్ష జంక్షన్ల మధ్య రైళ్ల రాక పోకలకు సుమారు రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి రైళ్లు అక్కడ నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పడాల్సి వచ్చింది. ఖాసన్ ఆదేశాలతో రైళ్లు నడుస్తున్నాయి. రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది సిగ్నల్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు చేపట్టారు. చీకురాయి గ్రామం వద్ద ఈ సంఘటన జరగడంతో చాలామంది అక్కడికి చేరుకొని ప్రమాద ఘటనను ఆసక్తిగా తిలకించారు. అయతే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై రైల్వే ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

చిత్రం.. గూడ్స్ రైలు ఢీకొట్టడంతో విరిగి పడిన హోం సిగ్నల్