జాతీయ వార్తలు

సివిల్స్‌లో తెలుగు ‘కీర్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: సివిల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. ఇంటర్వ్యూ దశ వరకూ 95 మంది రాగా ఇంత వరకూ అందిన సమాచారం ప్రకారం 20 మంది ఎంపికయ్యారు. గ్రూప్ ఎ గ్రూప్ బి సర్వీసులను సైతం కలుపుకుంటే ఈ సంఖ్య 50 వరకూ ఉండవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో సివిల్స్‌లో విశాఖపట్నానికి చెందిన సిహెచ్.కీర్తి అగ్రస్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా కీర్తి 14వ ర్యాంకును సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచిన కీర్తి చేకూరి మద్రాస్ ఐఐటి నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు.
ఎంపికైన అభ్యర్థుల జాబితాలో కీర్తి తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలవగా కర్నూలుకు చెందిన వల్లూరి క్రాంతి 65వ ర్యాంకును, విజయవాడకు చెందిన సిహెచ్ రామకృష్ణ 84వర్యాంకును, హైదరాబాద్‌కు చెందిన వాసన విద్యాసాగర్ నాయుడు 101 వ ర్యాంకు, జొన్నల గడ్డ స్నేహజ 103వ ర్యాంకును సాధించారు. వేమూరి విఎల్ అంబరీష్ 150 వ ర్యాంకును, నెల్లూరుకు చెందిన పోతరాజు సాయి చైతన్య 158వ ర్యాంకు, నివేదిత నాయుడు 159వ ర్యాంకు సాధించారు. అల్లటిపల్లి పవన్‌కుమార్‌రెడ్డి 179వ ర్యాంకు, వై. రిశాంత్ రెడ్డి 180 వ ర్యాంకు, గుంటుపల్లి వరుణ్ 183వ ర్యాంకు, నల్గొండకు చెందిన ఆర్ మహేష్ కుమార్ 189వ ర్యాంకు, పసుపర్తి విజి సతీష్ 191వ ర్యాంకు సాధించారు. సాలిజామల వెంకటేశ్వర్ 216వ ర్యాంకు, ప్రీతిపాల్ కౌర్ బత్ర 225 ర్యాంకు, బిహెచ్ నారాయణ రావు 233 వ ర్యాంకు, శశాంక్‌రెడ్డి 240 వ ర్యాంకు సాధించారు.
ఒక ఆంగ్ల దినపత్రికలో సాధారణ పాత్రికేయుడిగా పనిచేసిన పివిజి సతీష్‌కూడా సివిల్స్ లో మంచి ర్యాంకు సాధించారు. చిలుకూరి బాలాజీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న సతీష్ తండ్రి పిఆర్‌కె ప్రసాద్ సైతం పాత్రికేయుడిగా పనిచేశారు. ఐఎఎస్ అధికారి కావాలనేదే తన ఆకాంక్ష అని సతీష్ చెప్పారు. తన ర్యాంకుకు ఐపిఎస్ తప్పకుండా వస్తుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.
అవసరమైతే మరో మారు సివిల్స్‌కు హాజరై ఐఎఎస్‌ను సాధించాలని ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఇంత మంది సివిల్స్‌లో ఎంపిక కావడం అత్యుత్తమ ఫలితాలు కింద లెక్క అని బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ వి గోపాలకృష్ణ పేర్కొన్నారు. దీనికి కారణం సిశాట్ పరీక్ష పత్రంలో వచ్చిన మార్పులేనని అన్నారు. గ్రామీణ విద్యార్థులు సైతం మంచి మార్కులు సాధించుకునే వీలు ఈసారి కలిగిందని చెప్పారు.
రానున్న రోజుల్లో మరింత అత్యుత్తమ ఫలితాలను సాధించగలుగుతామని అన్నారు. ప్రిలిమినరీ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9,45,908 మంది హాజరుకాగా తెలుగురాష్ట్రాల నుండి 38,295 మంది హాజరయ్యారని అన్నారు. అందులో మెయిన్స్‌కు 450 మంది హాజరయ్యారని, దాని నుండి ఇంటర్వ్యూకు 95 మంది ఎంపికయ్యారని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఐఎఎస్‌కు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 45 మంది, ఐపిఎస్‌కు 150 మందిని యుపిఎస్‌సి ఎంపిక చేసింది. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఎకు 728 మంది, గ్రూప్ బి సర్వీసెస్‌కు 61 మంది ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన వారిలో తొలి ఇద్దరికి ఐఎఎస్ దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగిలిన వారిలో 15 మందికి ఐఎఫ్‌ఎస్ లేదా ఐపిఎస్ దక్కే వీలుందని చెబుతున్నారు.