జాతీయ వార్తలు

తక్షణ అరెస్ట్‌లు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: వరకట్న వేధింపుల కేసులో అప్పటికప్పుడే అరెస్ట్ చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. అన్ని విధాలుగా ఆరోపణలను నిర్థారించుకున్న మీదటే పోలీసులు ఇలాంటి కేసులకు సంబంధించి పోలీసులు అరెస్ట్‌లు జరపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వరకట్న వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోందంటూ, ఏళ్ల తరబడి పేరుకుపోయిన కేసుల నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వు జారీ చేసింది. 1983లో వరకట్న మరణాలు అత్యంత తీవ్రంగా సంభవిస్తున్న పరిస్థితుల్లో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎప్పటికప్పుడు ఫిర్యాదులు రావడంతో ఈ తాజా ఉత్తర్వు జారీ చేసింది. ప్రాథమిక విచారణ జరిపిన తరువాతే అరెస్ట్ చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది. 2014 జూలైలో మొత్తం 41 అంశాలతో కూడిన మార్గదర్శకాలను సుప్రీం కోర్టు జారీ చేసింది.
ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేయడానికి ముందు ఈ మార్గదర్శకాలను పరిశీలించాలని స్పష్టం చేసింది. తాజాగా న్యాయమూర్తి ఏకె గోయల్, యుయు లలిత్‌తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ‘మరణాలకు దారి తీస్తున్న వరకట్న వేధింపులను నిరోధించడానికి, మహిళలపై అకృత్యాలను అరికటాటలన్న లక్ష్యంతోనే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చాలా సందర్భాల్లో ఈ రకమైన వేధింపులు మహిళల ఆత్మహత్యలకు దారి తీశాయి’ అని స్పష్టం చేసింది. ఈ చట్టం దుర్వినియోగాన్ని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. భారత శిక్షాస్మృతిలోని 498 ఎ సెక్షన్ ప్రకారం దాఖలయ్యే వరకట్న వేధింపుల ఫిర్యాదులను ఈ కమిటీకి నివేదించాలని, వాటిని ఈ కమిటీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపింది. అలాగే ఈ కమిటీలు అనుసరించాల్సిన విధివిధానాలను కోర్టు జారీ చేసింది. ముందుగా సంబంధిత దంపతులను, వారి కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడాలని, అనంతరమే ఈ కమిటీ స్థానిక మేజిస్ట్రేట్‌కు నివేదిక ఇవ్వాలని సూచించింది. ఇలాంటి కేసుల్లో వేధింపులు జరిగాయని ఈ కమిటీ నివేదిక ఇచ్చే పక్షంలోనే దోషులను అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాజేశ్‌శర్మ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది.