జాతీయ వార్తలు

మావాళ్ల ఆచూకీ కనుక్కోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: ఇరాక్‌లో అదృశ్యమైన భారతీయుల ఆచూకీకోసం కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. 39 భారతీయులు ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలని ఇరాక్ ప్రభుత్వాన్ని ఇప్పటికే కేంద్రం కోరింది. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఇరాక్ మంత్రిని కోరారు. బదూష్‌లో ఇటీవల విదేశాంగ శాఖ సహాయ మంత్రి సింగ్ పర్యటనతో కొంత సమాచారం తెలిసిందని ఆమె పేర్కొన్నారు. ఇక్కడకు వచ్చిన ఇరాక్ విదేశాంగ మంత్రి ఇబ్రహీం అల్ జాఫ్రీతో సుష్మా స్వరాజ్ సమావేశమై అనేక అంశాలపై చర్చించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే వెల్లడించారు. అంతర్జాతీయ, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలూ చర్చించారని స్పష్టం చేశారు. ఇరాక్‌లోని మోసుల్‌లో చిక్కుకుపోయిన 39 మందికోసం తామెంతో ఆందోళన చెందుతున్నామని సుష్మా చెప్పారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి సింగ్‌కు సహకరించి 39 మంది సమాచారం అందించాలని ఇబ్రహీంను ఆమె కోరినట్టు విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. బదూష్ జైలులో వారు బంధీలుగా ఉన్నట్టు సమాచారం ఉందన్న మంత్రి వారికోసం తామెంతో ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. అలాగే ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల చెరనుంచి మోసుల్‌కు విముక్తి కల్పిండంపై ఇబ్రహీంపై సుష్మా ప్రశంసలు కురిపించారు. సుస్థిరత, శాంతి, సమగ్రతకోసం ఇరాక్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆమె ప్రకటించారు.