జాతీయ వార్తలు

రామేశ్వరం టు అయోధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామేశ్వరం, జూలై 27: దేశంలోని రెండు తీర్థయాత్ర కేంద్రాలైన అయోధ్య-రామేశ్వరం మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పచ్చజెండా ఊపారు. ఈ రైలు రామేశ్వరం-ఫైజాబాద్-రామేశ్వరం మధ్య వయా అయోధ్య మీదుగా నడుస్తుంది. బయో టాయిలెట్స్ సౌకర్యాలతోపాటు అనేక సదుపాయలు కల్పించినట్టు ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెల్లడించారు. దీనిని శ్రద్ధాసేతు ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తారు. తమిళనాడులోని మండపంలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. ‘రామేశ్వరాన్ని అయోధ్యలోని రామమందిరానికి కలుపుతూ రైలు నడుపుతారు. శ్రద్ధాసేతు ఎక్స్‌ప్రెస్ వారానికోసారి నడుస్తుంది. శ్రీరాముడి జన్మస్థలానికి నడిపే ఈ రైలు జాతికి అంకితం చేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. దక్షిణ రైల్వే వర్గాలు అందించిన వివరాల ప్రకారం రామేశ్వరంలో మధ్యాహ్నం 12.30కి బయలుదేరి, చెన్నై ఎగ్మోర్‌కు 3.20కి చేరుకుంటుంది. మర్నాడు ఉదయం 11 గంటలకు ఫైజాబాద్ వెళ్తుంది. నెం.16793/16794గా పిలవబడే ఈ రైలు తిరుచిరాపల్లి, తంజావూర్, చెన్నై ఎగ్మోర్, గూడూరు, విజయవాడ, బలార్ష, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, అలహాబాద్, జాన్‌పూర్, అయోధ్య స్టేషన్లలో ఆగుతుంది.

చిత్రం.. రామేశ్వరం నుంచి అయోధ్యకు వెళ్లే కొత్త రైలును ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ