జాతీయ వార్తలు

వరకట్న చట్టం సవరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: వరకట్న చట్టం మగవాళ్లను వేధించేందుకు ఓ ఆయుధంగా మారిపోయిందని బిజెపి ఎంపీ అన్షుల్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ వరకట్న చట్టానికి సవరణ చేయాలని డిమాండ్ చేశారు. 1998-2015 సంవత్సరాల మధ్య వరకట్న వేధింపుల కేసులో 27 లక్షల మందిని అరెస్టు చేశారని తెలిపారు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడమే తరువాయి కట్నం కేసులు బనాయిస్తున్నారని ఎంపీ ఆరోపించారు. కట్నం వేధింపుల కేసుల్లో అరెస్టయిన వారిలో మైనర్లూ ఉంటున్నారని వర్మ గుర్తుచేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498(ఎ)ను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిజెపి ఎంపీ అన్నారు. వరకట్నం చట్టం దుర్వినియోగం అవుతుందని సుప్రీం కోర్టు, హైకోర్టులు అభిప్రాయపడ్డ విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. కట్నం వేధింపుల కేసులు భరించలేక అనేక మంది మగవాళ్లు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని బిజెపి సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి చట్టాన్ని సవరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్‌సిపి సభ్యుడు ధనుంజయ్ మహదిక్ మాట్లాడుతూ విగ్రహాలకు జిఎస్‌టి నుంచి మినహాయింపుఇవ్వాలని డిమాండ్ చేశారు. గణేష్‌న నవరాత్రులు వస్తున్నందున కేంద్రం ఓ సానుకూల నిర్ణయం తీసుకుని ఆదుకోవాలనిన ఆయన కోరారు. భావ్‌నగర్- ముంబయి మధ్య డైలీ విమాన సర్వీసులు నడపాలని బిజెపి ఎంపీ భారతి శియాల్ కోరారు.