జాతీయ వార్తలు

కొత్త ఖండం జిలాండియాపై పరిశోధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: కొత్త ఖండం ‘జిలాండియా’పై పరిశోధనలకు రంగం సిద్ధమైంది. అక్కడ నెలకొన్న పరిస్థితులపై పరిశోధనలు జరిపేందుకు శాస్తజ్ఞ్రుల బృందం ఒకటి వెళ్లనుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ‘జిలాండియా’ ఖండాన్ని శాస్తజ్ఞ్రుల కనుగొన్న విషయం తెలిసిందే. ఖండం ఏర్పడడానికి, అక్కడ నెలకొని ఉన్న భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఓ బృందం శుక్రవారం బయలు దేరి వెళ్లింది. ఒకప్పుడు గోండ్వానా ఖండానికి చెందిన జిలాండియా 75 మిలియన్ సంవత్సరాల్లో జరిగిన మార్పుల వల్ల విడిపోయి ఉంటుందని జియోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికాకు చెందిన జిఎస్‌ఎ టుడే జర్నల్‌లో ఈమేరకు పరిశోధనా వ్యాసాన్ని ప్రచురించారు. దీని ఆధారంగా జిలాండియాను ఖండంగా గుర్తించవచ్చని శాస్తజ్ఞ్రులు అంటున్నారు.
ప్రస్తుతమున్న ఇతర ఖండాల మాదిరిగానే బలమైన భూమి పొరలు, భౌగోళిక పరిస్థితులు, సమీప ప్రాంతాలకంటే విస్తరించి ఉండడం తదితర లక్షణాలను బట్టి జిలాండియాను ఖండంతో పోల్చవచ్చని శాస్తజ్ఞ్రులు పేర్కొంటున్నారు. నూజిలాండ్‌కు దక్షిణాన, న్యూ కెలడోనియాకు ఉత్తరాన, కెన్ ప్లేటోకు పశ్చిమాన, ఆస్ట్రేలియాకు తూర్పున ఉన్న జిలాండియా 5 మిలియన్ల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిం ఉంది. ఇక్కడి రాళ్ల నమూనాలకు సేకరించి కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం జిలాండియా ఏవిధంగా ఉండేది, ఎలా రూపాంతరం చెందిందన్న విషయాలపై శాస్తవ్రేత్తలు పరిశోధనలు నిర్వహించనున్నారు. వాతావరణ మార్పులపై అధ్యయనానికి జిలాండియాలో పరిశోధనలు ఉపకరిస్తాయని శాస్తవ్రేత్త జెర్రి డికెన్స్ తెలిపారు.
రెండు నెలలపాటు సాగే పరిశోధనలు భూమి అంతర పొరల్లో చోటు చేసుకుంటున్న మార్పులను తెలుసుకోడానికి కూడా వీలుకలుగుతుందని అన్నారు. జిలాండియాపై గత 20 సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతున్నామని సైంటిస్ట్ నిక్ మార్టిమర్ తెలిపారు. జిలాండియా చాలా వరకు సముద్రంలో ఉందని, ఈ ఖండానికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించామని, త్వరలో కొత్త ఖండంలోని రహస్యాలను ఛేదిస్తామని చెప్పారు.