జాతీయ వార్తలు

సాయుధ బలగాలు సర్వసన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత సాయుధ బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభలో చెప్పారు. అంతేకాదు సైన్యానికి ఆయుధాలు, మందుగుండులాంటి కొరతలను సైతం తక్షణం భర్తీ చేయడం జరుగుతోందని కూడా ఆయన చెప్పారు. ఆయుధాలు, మందుగుండు కొరతలకు సంబంధించి కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో చేసిన వ్యాఖ్యలు ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినవి మాత్రమేనని ఆయన చెప్పారు. సైన్యానికి ఆయుధాలు, మందుగుండు లభ్యతలో తీవ్ర కొరతపై గత వారం కాగ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బి)ను తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సాయుధ దళాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయి. ఆయుధాలు, మందుగుండుకు సంబంధించి కొరతలను సైతం సత్వరం భర్తీ చేయడం జరుగుతోందని జైట్లీ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. డోక్లాం విషయంలో భారత్-చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండడం, జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రదాడుల ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2013నుంచి సైన్యానికి సరఫరా చేసిన ఆయుధాలు, మందుగుండులో తీవ్రమైన నాణ్యతా లోపాలుండడంపై కాగ్ ఓఎఫ్‌బిని తీవ్రంగా తప్పుబట్టడం తెలిసిందే. 2015లో సైన్యంలో మందుగుండు నిర్వహణకు సంబంధించి ఒక ఉన్నతస్థాయి నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని ఆ నివేదికలో పేర్కొంది. కాగా, నిబంధనల ప్రకారం కాగ్ నివేదికలను పార్లమెంటుకు సమర్పించిన తర్వాత అవి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఏసి)కి వెళ్తాయని, పిఏసి గనుక ఏమయినా సిఫార్సులు చేస్తే వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాగ్ నివేదికలో వ్యాఖ్యల దరిమిలా ఏ అధికారిపైనైనా చర్యలు తీసుకున్నారా అని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా జైట్లీ చెప్పారు. ఎంత మందుగుండు అవసరం లాంటి వివరాలను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ వివరాలను వెల్లడించడం మంచిది కాదని జైట్లీ చెప్పారు. కాగా, ఏ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని మూసివేయడం జరగదని, ఏ కార్మికుడు నిరుద్యోగిగా మారబోడని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే సభకు హామీ ఇచ్చారు.