జాతీయ వార్తలు

మైనింగ్‌పై రాష్ట్రాలతో 27న కేంద్రం సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, మే 10: ఖనిజాల తవ్వకంలో అక్రమాలను నిరోధించడం, ఇ-వేలం ద్వారా గనులను కేటాయించడం తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన గోవాలో అన్ని రాష్ట్రాలతో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. గోవా రాష్ట్ర గనులు, భూగర్భ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తొమర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఖనిజ తవ్వకాలు జరుగుతున్న అన్ని రాష్ట్రాలు పాల్గొంటాయని, ఖనిజాల తవ్వకంలో అక్రమాలను నిరోధించడం, ఇ-ఆక్షనింగ్ పద్ధతిలో గనులను కేటాయించడం తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరుగుతుందని ఆయన పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఈ సమావేశాన్ని గురించి తెలియపరుస్తూ గనుల శాఖ అండర్ సెక్రటరీ ఎకె.మాలిక్ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపారని ఆయన చెప్పారు.