జాతీయ వార్తలు

2019 మోదీదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 31: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దీటైన నాయకుడు ప్రస్తుతం దేశంలో లేరని, 2019 ఎన్నికల్లో ఆయన్ను సవాలు చేసి నిలబడగల సత్తా ఎవరికీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహాఘట్‌బంధన్‌తో తెగతెంపులు చేసుకుని ఎన్డీయేతో జతకట్టిన తరువాత నితీష్ మోదీపై ప్రశంసలు కురిపించారు. 2014లో మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని తీవ్రం గా వ్యతిరేకించి ఎన్డీఏ నుంచి వేరుపడ్డ నితీష్ ఇప్పుడు అదే మోదీని మెచ్చుకోవటం విశేషం. జాతీయ స్థాయిలో ఎన్డీ ఏలో భాగస్వాములై, మంత్రివర్గంలో చేరే అంశంపై ఆయన మాట్లాడుతూ ‘మాది చాలా చిన్న పార్టీ. జాతీయ స్థాయి ఆశలేం మాకు లేవు’ అని నితీశ్ కొట్టిపారేశారు. ఆగస్టు 19న జెడియు జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ ప్రభుత్వంలో చేరటమా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడిన ఆయన మహాకూటమితో విడిపోవటం బిహార్ ప్రయోజనాలను కాపాడటం కోసమేనని ఆయన స్పష్టం చేశా రు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లు తనను విమర్శించటాన్ని నీతీశ్ తప్పుపట్టారు. ‘ ఆయన(లాలూ) నన్ను తానే ముఖ్యమంత్రిని చేశానని అహం భావంతో అన్నారు. 2010లో ఆయన బలమేంటో బీహార్ ప్రజలు చెప్పారు. (అప్పుడు ఆర్జేడీకి వచ్చిన సీట్లు 22మాత్రమే)’ అని నితీశ్ అన్నారు. ‘‘మహాకూటమి నుంచి వైదొలగాలన్న నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకుంది కాదు. అటు పక్షం నుంచి (ఆర్జేడీ) పదే పదే నాపై ఆరోపణలు వచ్చాయి. వారి నేతలు నాపై విమర్శలు గుప్పించారు. అయినా లాలూ పట్టించుకోలేదు. అవన్నీ పార్టీ అంతర్గత వ్యవహారమని కొట్టిపారేశారు. కానీ జెడియు నేతలెవరూ ఆర్జేడీ చీఫ్ లాలూపై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఆర్జేడీ నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేసినా సంకీర్ణ ధర్మాన్ని రక్షించటం కోసం భరించాను’’ అని నితీశ్ అన్నారు. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై అవినీతి కేసును నమోదు చేయటంతో ఇక సంకీర్ణాన్ని కొనసాగించటం సాధ్యం కాలేదని ఆయన అన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దును నేను సమర్థించాను. అదే సమయంలో బినామీ ఆస్తులకు సంబంధించిన బలమైన కేసు తేజస్విపై నమోదైంది. వారిని సమర్థించటానికి నా దగ్గర ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. నేను లాలూ ప్రసాద్‌తో చాలాసార్లు మాట్లాడాను. కానీ ఆయన వాటిపై వివరణ ఇవ్వకుండా లౌకిక వాదం గురించి పదే పదే ప్రస్తావించారు. భారీ మొత్తంలో సొమ్ము చేసుకోవటం, సెక్యులరిజం ముసుగులో దాన్ని దాచిపెట్టుకోవటమేనా లౌకిక వాదం?’’ అని నితీశ్ ప్రశ్నించారు. పాట్నా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతగా లాలూ గెలిచేందుకు తాను ఎలా దోహద పడిందీ, 1990లో యాదవేతర ఎమ్మెల్యేలు లాలూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని సమర్థించేందుకు ఎలా సాయపడిందీ నితీశ్ చెప్పుకొచ్చారు. సీనియర్ నేత శరద్‌యాదవ్ అసంతృప్తిపై నితీశ్ మాట్లాడుతూ ప్రతిసారీ, ప్రతి అంశాన్నీ, ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారని భావించలేమని అన్నారు.