జాతీయ వార్తలు

నితీశ్ ప్రభుత్వంపై పిటిషన్ల కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 31: నితీశ్‌కుమార్ నేతృత్వంలో బిహార్‌లో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్లను పాట్నా హైకోర్టు కొట్టివేసింది. బిజెపి మద్దతుతో జెడి(యు) ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుందని, ఈ విషయంలో కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవని స్పష్టం చేసింది. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై కోర్టులు కలుగజేసుకోవని చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ ఎకె ఉపాధ్యాయ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎన్‌డిఏ మద్దతుతో జెడి(యు) పార్టీ నితీశ్ నేతృత్వంలో బిహార్‌లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, వెంటనే అసెంబ్లీలో బలనిరూపణకు దిగడం తెలిసిందే. జెడి(యు) సంకీర్ణానికి 131, ప్రతిపక్షానికి 108 ఓట్లు వచ్చాయి. నితీశ్‌కుమార్ రాజీనామా చేసి ఎన్‌డిఏ మద్దతుతో మళ్లీ బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఆర్‌జెడి ఎమ్మెల్యేలు సరోజ్ యాదవ్, చందన్ వర్మ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జితేంద్ర కుమార్ కోర్టులో సవాల్ చేశారు.