జాతీయ వార్తలు

ప్రభుత్వ వ్యతిరేకులను టార్గెట్ చేయొద్దు: నసీం గిలానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 31: ప్రభుత్వ వ్యతిరేకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేయకూడదని నసీం గిలానీ విమర్శించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆర్థికంగా సాయం చేస్తున్నారన్న అభియోగంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ గిలానీ తనయుడు నసీం గిలానీని విచారణకు పిలిచింది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న వారిని విచారించడం మంచిదే గాని కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకులుగా ఉన్న వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలు చేపట్టడం విచారకరమని నసీం ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం అందరినీ ఒకేలా చూడాలని అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో విలాసవంతమైన నివాసాన్ని గిలానీ కలిగి ఉన్నాడని కొన్ని సంవత్సరాల కిందట ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. జాతీయ దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరుకావాల్సిన నసీం గిలానీ ఛాతీనొప్పితో ఆదివారం స్కిమ్స్ ఆసుపత్రి ఐసియులో చేరడం కొసమెరుపు.