జాతీయ వార్తలు

నేడు అసోంకు ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువాహతి, జూలై 31: వరదలతో అతలాకుతలమైన అసోంను మంగళవారం ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా రెండు సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు అస్సాం రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమాంత బిస్వా శర్మ తెలిపారు. తరచూ వరదలు అసోంను ముంచెత్తుతుండడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు రాష్ట్ర మంత్రి మండలి, అధికారులతో ప్రధాని చర్చలు జరుపనున్నట్లు చెప్పారు. అనంతరం ఎన్డీయే సంకీర్ణంలోని బిజెపి, బిపిఎఫ్, ఎజిపి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వరదల్లో మృతిచెందిన వారి వివరాలు, కావాల్సిన నిధుల వివరాలను పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం అసోం ప్రభుత్వాన్ని ఇంతకుముందే కోరింది. ఈ నెల 25న ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందాన్ని వరద పరిస్థితిపై నివేదిక పంపేందుకు పంపింది. ఇప్పటివరకు వరదల్లో 83 మంది మృతి చెందారు. లక్ష్మిపూర్, జోర్హాత్ జిల్లాల్లో వరదలవల్ల ఐదు వేల మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ శిబిరాలలో 366మంది ఆశ్రయం పొందుతున్నారు.