జాతీయ వార్తలు

జీఎస్టీ ఫలాలు అందరూ పొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: జీఎస్టీ ఫలాలను అందరూ పొందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వివిధ రాష్ట్రాల్లో బిజెపికి చెందిన ఎంపీలతో సోమవారం తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ, జీఎస్టీతో అందరూ లబ్ధి పొందేందుకు నిరంతరం కృషి చేయాలని చెప్పారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు జీఎస్టీలో నమోదయ్యేలా చూడాలని పేర్కొన్నారు. జీఎస్టీపై చిరు వ్యాపారులు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలవారు జీఎస్టీకి సంపూర్ణ మద్దతు తెలిపారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వృద్ధులకోసం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి వయో వందన యోజన’ పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎంపీలను ప్రధాని కోరారు. ఆ విధంగానే పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయోజనార్థం కేంద్రం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, ఉద్యోగాల కల్పన, పర్యాటక అభివృద్ధితో అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో హర్యానా, ఢిల్లీ, జమ్ముకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి బిజెపి ఎంపీలు పాల్గొన్నారు.