జాతీయ వార్తలు

ప్రభుత్వ భవనాలు ఖాళీ చేయక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: ప్రభుత్వం కల్పించే వసతిలో ఏళ్ల తరబడి తిష్టవేసిన ఎంపీలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు తీరా ఖాళీచేయాల్సి వచ్చినప్పుడు వ్యతిరేకించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. అలాంటి వారిని సాధ్యమైనంత త్వరగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, గడవు లోపల ఖాళీ చేయించేందుకు సంబంధించిన బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి ఇందర్‌జిత్ సింగ్ ‘పబ్లిక్ ప్రిమిసెస్ సవరణ బిల్లు-2017’ను సభ ముందుంచారు. ప్రభుత్వం గృహాల్లో అనధికారికంగా ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించే అంశం బిల్లులో పొందుపరించారు. నివాసాలు ఖాళీచేసే విషయంలో తలెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం తీవ్రంగానే పరిగణించింది. ఇలాంటి కేసుల్లో సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయించే అధికారం ఎస్టేట్ అధికారులకు అప్పగిస్తారు. ఇంతకుముందు చట్టంలోనూ ఎస్టేట్ అధికారులకు అధికారులన్నపటికీ ఎక్కడా అమలయిన దాఖలాలు లేవపోవడంతో సవరణ బిల్లును తీసుకొచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ భవనాల్లో ఏళ్లతరబడి ఉంటూ తీరా ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించడం జరుగుతోంది. కొత్త బిల్లులో అలాంటివాటికి ఆస్కారం లేకుండా ఉండేలా చూశారు. అంతేకాదు నివాసాలకు అయ్యే డ్యామేజీకి సంబంధించి నెలనెలా వసూలుకు కొత్త బిల్లులో నిబంధనలున్నాయి. ‘ప్రభుత్వ గృహాల్లో అనధికారికంగా ఏళ్ల తరబడి ఉంటున్నవారిని ఖాళీ చేయించడం బిల్లు ముఖ్య ఉద్దేశం. ఒక నిర్ణీత గడువు నిర్ణయించి ఆలోగా ఖాళీ చేయించాలి. ఈ విషయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయించాలి అన్నదే ప్రభుత్వం అభిప్రాయం’ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.