జాతీయ వార్తలు

నితీశ్ నిర్ణయం దురదృష్టకరం: శరద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: బీహార్‌లో మహా ఘట్‌బంధన్‌ను చీల్చి బిజెపితో జెడియు జతకట్టడం దురదృష్టకరమని ఆ పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్‌లో జెడియు, ఆర్జేడీ కాంగ్రెస్‌ల మహాకూటమికి అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారని, కానీ ఈ సంకీర్ణం విచ్ఛిన్నం కావటం బాధకరంగా ఉందని ఆయన సోమవారం వ్యాఖ్యానించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహా కూటమి నుంచి వైదొలగి బిజెపితో జత కట్టిన తరువాత శరద్ యాదవ్ పలువురు విపక్ష నేతలతో కలిశారు. కాంగ్రెస్, వామపక్షాలలో సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. నితీశ్‌తో కలిసి జెడియును స్థాపించిన శరద్‌యాదవ్ తన వ్యాఖ్యలతో పార్టీకి దూరమవుతున్న సంకేతాలిచ్చారు. అయితే జెడియు మాత్రం ఈ వదంతులను కొట్టి పారేసింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని పేర్కొంది.