జాతీయ వార్తలు

వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 2,100 కొత్త విమానాలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: రానున్న 20 ఏళ్లలో భారత్ కొత్తగా 2,100 విమానాలను కొనుగోలు చేస్తుందని, ఇందుకోసం దాదాపు 290 బిలియన్ డాలర్ల మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని భావిస్తున్నామని అమెరికా ఏరోనాటిక్ దిగ్గజం ‘బోయింగ్’ పేర్కొంది. విమానాల కొనుగోలు విషయంలో భారత్‌కు సంబంధించి ఇదే అతిపెద్ద అంచనా అని ఆ సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 41,030 కొత్త విమానాల కొనుగోలుకు డిమాండ్ ఉందని, దీనిలో భారత్ వాటా 5.1 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని ప్రస్తుత మార్కెట్ తీరు తెన్నులపై సోమవారం విడుదల చేసిన నివేదికలో బోయింగ్ సంస్థ అంచనా వేసింది. భారత్‌లో విమానయాన సేవలను అందజేస్తున్న అన్ని సంస్థలు 60 శాతం కంటే ఎక్కువగా చౌక రకం విమానాలనే నడుపుతున్నాయని, కనుక భారత్ కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో దాదాపు 85 శాతం చౌక రకం విమానాలే ఉంటాయని భావిస్తున్నామని బోయింగ్ తెలిపింది. విమాన ప్రయాణాల వైపు మొగ్గుచూపే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో పాటు రూపాయి మారకం విలువ బలపడటం, ఇంధన ధరలు తగ్గడంతో భారత్‌లో విమానయాన మార్కెట్ క్రమంగా పుంజుకుంటోందని బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ ఆసియా పసిఫిక్, ఇండియా సేల్స్ విభాగ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ దినేష్ కెస్కర్ తెలిపారు.