జాతీయ వార్తలు

పనగరియా రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈనెల 31తో పనగరియా పదవీకాలం ముగియనుంది. దీనికి ముందే ఆయన రాజీనామా చేస్తున్నటుట ప్రకటించారు. 2014లో ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసిన ప్రధాని నరేంద్ర మోదీ దాని స్థానే నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. దానికి తొలి ఉపాధ్యక్షుడిగా అరవింద్ పనగరియా(62)ను నియమించారు. ఇండియన్ అమెరికన్ ఎకానమిస్ట్ అయిన పనగరియా కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం ప్రొఫెసర్‌గా పనిచేశారు. తిరిగి అమెరికాకు వెళ్లి విద్యారంగంలో సేవలందించాలని పనగరియా యోచిస్తున్నారు. ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పిహెచ్‌డి చేసిన ఆయన ప్రపంచ బ్యాంకు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వాణిజ్యం, అభివృద్ధిపై ఐరాస కాన్ఫరెన్స్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. పద్మభూషణ్ పనగరియా అంతకు ముందు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. కాగా కొలంబియా యూనివర్శిటీ నుంచి సెలవుపొడిగింపునకు అనుమతి రానందున నీతి ఆయోగ్ ఉపాధ్యక్షత పదవికి రాజీనామా చేస్తున్నట్టు మీడియాకు ఆయన తెలిపారు. తనను నీతి ఆయోగ్ విధుల నుంచి విడుదల చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి పనగరియా ఓ లేఖ రాశారు.