జాతీయ వార్తలు

దిగ్విజయ్‌కి ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్‌కు అధిష్ఠానం ఉద్వాసన పలికింది. ఆయన్ను తక్షణం బాధ్యతల నుంచి తప్పించి పార్టీ సీనియర్ నేత ఆర్‌సి కుంతియాను నియమించారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ పార్టీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పక్షాన బుధవారం తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్‌సి కుంతియాను పూర్తి స్థాయి ఇంచార్జ్‌గా నియమిస్తున్నట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ ఒక ప్రకటన జారీ చేశారు. కుంతియాకు సహకరించేందుకు సతీష్ జర్కిహోలీని కార్యదర్శిగా నియమించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ని ఈ బాధ్యతల నుండి వెంటనే తప్పిస్తున్నట్లు ద్వివేదీ స్పష్టం చేశారు. అయితే, దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తారా? లేదా? అనేది కాంగ్రెస్ అధినాయకత్వం స్పష్టం చేయకపోవటం గమనార్హం. దిగ్విజయ్‌ని తెలంగాణా కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి తొలగించాలని పార్టీకి చెందిన సీనియర్ నాయకులతోపాటు జూనియర్ నాయకులు కూడా చాలాకాలం నుండి డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దిగ్విజయ్ మూలంగానే విభజన సమయంలోనూ, అ తరువాతా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నదని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా దిగ్విజయ్
దురుద్దేశ్యంతోనే అదుపు చేయలేదన్నది ప్రధాన ఆరోపణ. విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణాలో కాంగ్రెస్‌ను పటిష్ఠం చేసేందుకు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని పార్టీ నేతలు తరచూ ఆరోపించటం తెలిసిందే. దిగ్విజయ్‌ని తప్పిస్తే తప్ప తెలంగాణలో పార్టీ బాగుపడదంటూ పలువురు నేతలు సైతం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పలుమార్లు సూచించారు. ఇటీవల గోవా, మణిపూర్ ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకున్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయటంలో విఫలం కావటానికి కూడా దిగ్విజయ్ పోకడలే కారణం కావటంతో ఆ రాష్ట్రాల బాధ్యతల నుంచి కూడా దిగ్విజయ్‌ని తప్పించారు. ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీ పటిష్ఠతకు ఎలాంటి చర్యలు కనిపించటం లేదు. మరో రెండేళ్లలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయటానికి అధిష్ఠానానికి ఇంచార్జిని మార్చక తప్పలేదు.