జాతీయ వార్తలు

పుస్తకాల ధరలు పెరగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల ధరలు పెంచే యోచన లేదని సంస్థ మంగళవారం ఇక్కడ ప్రకటించింది. ధరలు పెరుగుతాయంటూ వచ్చిన వార్తలను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) ఖండించింది. పుస్తకాల ధరలు పెరుగుతున్నాయంటూ కృత్రిమ కొరత సృష్టించి లాభపడడానికి కొన్ని శక్తులు పనిచేస్తుయని సంస్థ ఆరోపించింది. తమ పుస్తకాల ధరలు పెంచే ప్రతిపాదన ఏదీలేదని ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ హృషికేశ్ సేనాపతి స్పష్టం చేశారు. ‘ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు అన్నీ సంస్థ అధికారి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. ఎవరూ ఎలాంటి ధర చెల్లించనక్కర్లేకుండా పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు’ అని ఆయన ప్రకటించారు. డైరెక్టర్ వివరణతో ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాల ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తలను తెరపడినట్టయింది.