జాతీయ వార్తలు

ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,350కోట్ల ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఆగస్టు 1: వరదల బారినపడ్డ ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,350 కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వరదలవల్ల కలిగిన నష్టాలనుంచి బయటపడేందుకు, స్వల్ప, దీర్ఘకాలిక పనులు చేపట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యారు. ఒక్క రోజు పర్యటనకు గువాహతి వచ్చిన మోదీ వరదలపై తాజా పరిస్థితిపై చర్చించారు. ఈ మేరకు ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,350 కోట్ల ప్యాకేజీని ప్రధాని ప్రకటించారని అస్సాం ఆర్థిక మంత్రి హిమాంత బిస్వా శర్మ విలేఖరులకు తెలిపారు. ఇందులో రూ.2వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ కింద, బ్రహ్మపుత్ర నదివల్ల సంభవిస్తున్న వరదలపై అధ్యయనం చేసేందుకు ఓ రిసర్చ్ ప్రాజెక్టుకుగాను రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వరద బాధితులను ఆదుకునేందుకు, వారికి పునరావాసం కల్పించేందుకుగాను తక్షణ సాయంగా రూ.250 కోట్లను ప్రకటించారని శర్మ తెలిపారు. అయితే రూ.2వేల కోట్లలో ఏ రాష్ట్రానికి ఎంత వాటా అన్నదానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
త్వరలో ఈ నిధుల్లో ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలన్నదానిపై నిర్ణయిస్తారని తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీ కాకుండా ఇంతకు ముందే రూ.300 కోట్లు వరద సాయం కింద కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

చిత్రం.. గౌహతిలో మంగళవారం ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ