జాతీయ వార్తలు

గ్యాస్ ధరలపై భగ్గుమన్న విపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌పై ఇస్తున్న రాయితీని 2018 మార్చి నాటికి తొలగించాలంటూ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బుధవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తాయి. వంటగ్యాస్ ధరలను ఇక మీదట ప్రతి నెలా నాలుగు రూపాయల చొప్పున పెంచటంతోపాటు 2018 మార్చి నాటికి మొత్తం రాయితీని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ప్రతిపక్షాలు లోక్‌సభ నుండి వాకౌట్ చేయటంతోపాటు రాజ్యసభను స్తంభింపచేశాయి. ఈ నిర్ణయం దేశంలోని కొట్లాది మంది మధ్యతరగతి కుటుంబాలకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. వంట గ్యాస్ ధరను ఏకపక్షంగా పెంచటం మంచిది కాదని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో స్పష్టం చేశాయి. కాంగ్రెస్, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, బిజెడి తదితర పార్టీల నాయకులు కూడా వంటగ్యాస్‌పై ఇస్తున్న రాయితీని తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వంటగ్యాస్ ధరను తగ్గించాలంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలిచ్చాయి. ప్రతిపక్షం సభ్యులు మాట్లాడిన అంతరం దీనిపై మంత్రి చేత సమాధానం ఇప్పించటం సాధ్యం కాదని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. దీనితో ఆగ్రహించిన కాంగ్రెస్, సిపిఎం, ఎన్‌సిపి తదితర పార్టీలు లోక్‌సభ నుండి వాకౌట్ చేశాయి.
వంటగ్యాస్ ధరలపై రాజ్యసభ జీరో అవర్‌లో ప్రతిపక్షాలు ప్రస్తావించాయి. వంట గ్యాస్ ధరను పెంచుతున్నట్లు లోక్‌సభలో ప్రకటించినంత మాత్రాన సరిపోతుందా.. రాజ్యసభకు తెలియజేయవలసిన అవసరం లేదా? అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. వంటగ్యాస్ ధరల విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ప్రతిపక్షం దుయ్యబట్టింది. వంట గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న సమయంలో వంట గ్యాస్ ధరను ఎలా పెంచుతారని జె.డి(యు) నాయకుడు శరద్ యాదవ్ నిలదీశారు. వంట గ్యాస్ విషయంలో ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది మరొకటని డెరిక్ ఓబ్రేన్ ఆరోపించారు. వంటగ్యాస్ సిలండర్ ధరను 35 రూపాయలు పెంచాలని 2010లో సిఫారసు చేసిన ఉన్నతాధికారాల కమిటీలో సీనియర్ నాయకులు మమతా బెనర్జీ, శరద్ పవార్ సభ్యులుగా పని చేశారని ఆధికార పక్షం వివరించింది. ఈ దశలో పలువురు ప్రతిపక్షం సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ గొడవ చేయటంతో సభ వాయిదా పడింది.

చిత్రం.. రాజ్యసభలో మంగళవారం పోడియం వద్దకు చేరి నినదిస్తున్న విపక్షాలు