జాతీయ వార్తలు

బిసి కమిషన్ బిల్లు కాంగ్రెస్‌కు ఇష్టంలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: వెనుకబడిన కులాల జాతీయ కమిషన్ ఏర్పాటు కావటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, అందుకే ఆ బిల్లును రాజ్యసభలో ఆ పార్టీ అడ్డుకుందని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలె మంగళవారం తీవ్రంగా ఆరోపించారు. 27 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓబిసి కమిషన్‌కు సాధికారత కల్పించటానికి ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. కమిషన్‌లో సభ్యుల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదిస్తూ సవరణ చేసిన బిల్లును ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డుకున్న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. ఓబిసి కమిషన్‌కు సంబంధించి రాజ్యాంగంలో 123వ సవరణ బిల్లుపై సోమవారం రాజ్యసభలో పలు సవరణలు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. విపక్షాల ఆందోళనతో బిల్లులో మూడో క్లాజును తొలగించి మరీ బిల్లును ఆమోదించారు. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో బిల్లు ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం. అయితే అధికార ఎన్డీఏకు సంఖ్యాబలం తక్కువ కావటంతో విపక్షానిదే గెలుపైంది. ఇటీవలే ఎన్డీఏలో చేరిన జెడియు పదిమంది సభ్యులతో బలం పెరిగినా మెజార్టీ మాత్రం సాధించలేదు.