జాతీయ వార్తలు

ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత నోటా ఎలా ప్రకటిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఆగస్టు 1: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నోటా (నన్ ఆఫ్ ది అబవ్)ను ఎలా ప్రకటిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. జూన్‌లో జరగాల్సిన ఎన్నికలను ఎందుకు ఆలస్యంగా నిర్వహించాల్సి వచ్చిందంటూ అయన ప్రశ్నించారు. గుజరాత్, గోవా, పశ్చిమ బెంగాల్‌లలో పది రాజ్యసభ సీట్లకు ఈ నెల 8న ఎన్నికలు జరుగనున్నాయి. మొదట గత జూన్ 8న ఈ సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన ఎన్నికల సంఘం అనంతరం ఎన్నికలను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురు పార్టీని విడిచి వేరే పార్టీల్లో చేరారు. అందులో ముగ్గురు బిజెపిలో చేరారు. దీంతో 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ రిసార్ట్‌కు తరలించింది.