జాతీయ వార్తలు

ఉదారంగా నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఆగస్టు 6: బిహార్‌కు ఉదారంగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వీలుగా నిధుల అవసరాన్ని తీర్చాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బిజెపి, జెడి(యు) చేతులు కలిపాయని, ఆ స్నేహహస్తం నిధుల కేటాయింపులోనూ కనిపించాలని నితీశ్ కుమార్ కోరారు. 38 జిల్లాలతో 101 సబ్‌డివిజన్లతో కూడిన బిహార్ చాలా పెద్ద రాష్టమ్రని పేర్కొన్న నితీశ్ కుమార్ సరిపడని పరిమాణంలో నిధులు కేటాయిస్తే ఎలాంటి అవసరమూ తీరదని కేంద్రానికి తెలిపారు. ముఖ్యంగా న్యాయవ్యవస్థను బలోపేతం చేయడానికి 60 నుంచి 70 కోట్లు ఇస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసిన నితీశ్ కుమార్, ఈ నిధులవల్ల ఏ రకమైన లక్ష్యము నెరవేరదని స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం 25వేలు-26వేల కోట్ల మధ్య ఉన్న బిహార్ బడ్జెట్, ఇప్పుడు లక్షా 40వేల కోట్లకు చేరుకుందని పేర్కొన్న నితీశ్, కేంద్రం ఏ రకంగా నిధులిచ్చినా అవి విస్తృతంగా ఉండాలని, ముఖ్యంగా దిగువస్థాయి న్యాయ వ్యవస్థ బలోపేతానికి దోహదం చేయాలని స్పష్టం చేశారు. పాట్నా హైకోర్టు చేపట్టిన విస్తరణ కార్యక్రమం కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే 169 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. టెలీ లా కార్యక్రమంలో మాట్లాడిన నితీశ్ కుమార్ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ తాజా కార్యక్రమం వల్ల గ్రామాల్లో ఉండే సామాన్యులకు సైతం న్యాయసేవలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. అంతకుముందు మాట్లాడిన కేంద్ర మంత్రి ప్రసాద్, రాష్ట్రంలో జెడి(యు), బిజెపి చేతులు కలిపిన తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందకరమన్నారు. రెండు పార్టీల స్నేహానికి సంకేతంగా జరిగిన అతిపెద్ద కార్యక్రమం కూడా ఇదేనని స్పష్టం చేశారు.

చిత్రం.. పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో నితీశ్‌కుమార్