జాతీయ వార్తలు

యుపిలో బంగ్లా ఉగ్రవాది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 6: బంగ్లాదేశ్‌కు చెందిన కరడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్లాను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఎటిఎస్) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అన్సారుల్లా బంగ్లా టీమ్ (ఎబిటి)కి చెందిన ఈ ఉగ్రవాదిని ముజఫరాబాద్ జిల్లాలోని కుటేసారా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గత నెల రోజులుగా అబ్దుల్లా ఈ జిల్లాలోనే ఉంటున్నాడని, ఆధార్‌సహా అనేక గుర్తింపు కార్డులను ఉగ్రవాదులకు సమకూర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. అబ్దుల్లాకు సొంత ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ కూడా ఉందని వెల్లడించారు. అతడినుంచి కొన్ని నకిలీ ఆధార్ కార్డులు, స్టాంపులు, పాస్‌పోర్టులు ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.