జాతీయ వార్తలు

చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాటం కొనసాగిస్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం జంతర్ మంతర్‌లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేటప్పుడు బిసిలకు రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు. బిసి రాజ్యాంగ హోదా బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు ఎర్రా సత్యనారాయణ, వరప్రసాద్ యాదవ్, గుజ్ఞ కృష్ణ, ఆర్.సత్యనారాయణ, కోలా జనార్దన్, గోరిగే మల్లేశ్, నేల వెంకటేష్, కర్రి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.