జాతీయ వార్తలు

త్వరగా విచారించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: బోఫోర్స్ కేసు విచారణను వీలైనంత త్వరగా విచారించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. 1986నాటి 1437 కోట్ల బోఫోర్స్ గన్‌ల కొనుగోలు వ్యవహారంలో రూ.64కోట్ల మేర క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలు దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి తెలిసిందే. నెహ్రూ-గాంధీ కుటుంబంపై అవినీతి మరకలంటించిన ఈ స్కాంపై విచారణను వేగవంతం చేయాలని బిజెపి నేత, న్యాయవాది అజయ్ అగర్వాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. యూరోప్‌కు చెందిన హిందూజా సోదరులపై ఉన్న ఆరోపణలను 2005లో ఢిల్లీ హైకోర్టు కోట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 2005 అక్టోబర్ 18న అజయ్ అగర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు అనంతరం 90 రోజుల్లో అప్పీల్‌కు వెళ్లడంలో సిబిఐ విఫలం కావటంతో అజయ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. అప్పటి న్యాయమంత్రిత్వ శాఖ తమకు అనుమతి ఇవ్వకపోవటంతో సిబి ఐ అప్పీల్‌కు వెళ్లలేదు. సిబి ఐ, నిందితులు కుమ్మక్కయ్యారంటూ అజయ్ అగర్వాల్ తన పిటిషన్‌లో ఆరోపించారు. ఇందుకు దన్నుగా నిలిచే అంశాలను ఒకదాని వెంట ఒకటిగా ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.