జాతీయ వార్తలు

బిజెపియేతర ప్రభుత్వాలను పడగొట్టడమే వారి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: కేరళ రాష్ట్రంలో రాజకీయ హింస సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి ప్రయత్నిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఆదివారం ఆంధ్రాభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, బిజెపి తమ రాజకీయ ప్రత్యర్థులపై సిబిఐ, ఈడిలను ఉపయోగించి దాడులు చేయిస్తోందని విమర్శించారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, కాని కేరళలో అటువంటివి జరగడం లేదని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి కేరళ వెళ్లి హడావిడి చేయాల్సిన అవసరం లేదని, ముందు బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ పథకం ప్రకారం అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా పార్టీల మధ్య హింసాయుత వాతావరణం మంచిది కాదని పేర్కొన్నారు. కేరళలో జరిగిన రాజకీయ హత్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, శాంతి కమిటీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బిజెపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకసారేమో తానే కమ్యూనిస్టునని అంటారని, మరోసారి ఆ సిద్ధాంతాలకు కాలం చెల్లిందని అంటుంటారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ అనంతరం టిఆర్‌ఎస్ పార్టీ మాయపై పోవచ్చు కాని, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం మనుగడ సాగిస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 1700 లారీల ఇసుకను ఒకొక్కటి 65వేల చొప్పున అమ్ముకుంటున్నారని, దీనిని ప్రశ్నిస్తున్న స్థానికులపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిని పోలీసు అధికారులు సైతం బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏన్డీయే ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇస్తూ, జీఎస్టీ పేరుతో కేంద్రం దోపిడీ చేస్తోందని బాధపడటంలో అర్థం లేదని అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడితే తాము కూడా మద్దతు ఇస్తామని అన్నారు.