జాతీయ వార్తలు

మొండి బకాయిల మాఫీపై వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు రూ.83,683 కోట్ల మొండిబకాయిలను మాఫీ చేశాయంటూ మీడియాలో వచ్చి వార్తలపై వివరణ ఇవ్వాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేయాలని ఆయన కోరారు. ‘కేరళలో సెలవులు పూర్తయితే జైట్లీ వెనక్కి వచ్చి ఈ అంశంపై మాట్లాడాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేరళలో దుండగుల దాడిలో చనిపోయిన ఆరెస్సెస్ కార్యకర్తల కుటుంబ సభ్యులను జైట్లీ ఆదివారం పరామర్శించిన సంగతి తెలిసిందే. కేరళలో సిపిఎం శత్రువులను అంతమొందించే పనిలో ఉందని జైట్లీ చేసిన ఆరోపణలను ఏచూరి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మొండిబకాయిల గురించి ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు.
బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన వారంతా ప్రముఖులేనని, కార్పొరేట్ సంస్థలేనని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి రెండేళ్లలో 1.14లక్షల కోట్ల మొండిబకాయిలను మాఫీ చేశారని, ఇప్పుడు తాజాగా రూ.81,683 కోట్ల రూపాయలను మాఫీ చేశారని విమర్శించారు. ప్రభుత్వ చర్యవల్ల ఎవరు లాభపడుతున్నారో స్పష్టంగా తేలిపోతోందని ఆయన అన్నారు.