జాతీయ వార్తలు

మాయావతికి ఇక గడ్డురోజులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఉత్తరప్రదేశ్‌లో బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతికి ఇక గడ్డురోజులే. పార్టీలో మాయావతిపై ఉన్న అంసతృప్తి సెగలు మొత్తం ఆమె నాయకత్వానికే ఎసరుపెట్టాయని తాజా రాజకీయ పరిణామలు సూచిస్తున్నాయి. ఆమెకు చెక్‌పెట్టడానికి బిఎస్పీ మాజీ నేతలు రంగంలోకి దిగారు. ఆదివారం నాడిక్కడ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన కీలక సమావేశంలో దళిత, ముస్లిం, ఓబిసి తదితర 16 సంఘాలను ఓ వేదికపైకి తీసుకురావాలని నిర్ణయించారు. తద్వారా మాయావతి ప్రాబల్యాన్ని అడ్డుకోవాలని బిఎస్పీ మాజీలంతా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. మాయావతికి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నసీముద్దీన్ సిద్ధిఖీ ఈ సామాజిక వర్గాలన్నింటినీ ఏకం చేయాలని నిర్ణయించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు తరువాత సిద్దిఖీని బిఎస్పీ నుంచి బహిష్కరించారు. వెంటనే సిద్దిఖీ నేషనల్ బహుజన అలయెన్స్, కోఆర్డినేషన్ కమిటీ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేశారు. బిఎస్పీ మాజీ ఎంపీ ప్రమోద్ కురీల్‌ను దానికి కన్వీనర్‌గా నియమించారు. ఢిల్లీలో సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన ప్రమోద్ ‘నేనిప్పటికీ బిఎస్పీ మనిషినే. అయితే మాయావతికి చెక్‌పెట్టాలన్నదే మా ఆలోచన’ అని ప్రకటించారు. సిద్దిఖీ పార్టీనుంచి బహిష్కృతుడైనప్పటినుంచీ మాయావతి నాయకత్వానికి ఎసరుపెడతారని వార్తలు వెలువడ్డాయి. సిద్ధిఖీనే కాదు బిఎస్పీలోని కొందరు ఎమ్మెల్యేలూ మాయావతిని సాగనంపాలని కోరుకుంటున్నట్టు ఓ మీడియా సంస్థకు ఆయన వెల్లడించారు. మరోపక్క సిద్దిఖీ బిజెపితో టచ్‌లోనే ఉన్నారని ఆయన వర్గీయులు పేర్కొన్నారు. ఢిల్లీ సమావేశానికి పలు రాష్ట్రాల నుంచి 16 రాజకీయ, రాజకీయేతర సంఘాలు హాజరయ్యాయని ఆయన చెప్పారు. త్వరలోనే మరోసారి సమావేశమై ఓ ఫ్రంట్‌గా ఏర్పాటవుతామని సిద్దిఖీ వెల్లడించారు. సర్వసమాజ్ పేరుతో ఒక వేదికపైకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ఆయన తెలిపారు. మాయావతి బాధితులు ఎందరో ఒంటరి పోరాటం చేస్తున్నారని, వారందరినీ ఒకే తాటిపైకి తేవాలన్నదే తమ అజెండా అని కన్వీనర్ ప్రమోద్ స్పష్టం చేశారు.