జాతీయ వార్తలు

ముగిసిన అమర్‌నాథ్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 7: దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో వేంచేసిన అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని ఈ ఏడాది 2.60 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. నలభై రోజులపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర సోమవారంతో ముగిసింది. యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది మంది యాత్రికులు మృతిచెందారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అమర్‌నాథ్ యాత్ర ఏటా రక్షాబంధన్ రోజున ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరం యాత్రికుల సంఖ్య తగ్గిందని శ్రీ అమర్‌నాథ్ ఆలయ ట్రస్ట్‌బోర్డు వెల్లడించింది. 14 ఏళ్లలో ఇంత తక్కువ మంది యాత్రికులు రావడం ఇది రెండోసారి. గత ఏడాది కేవలం 2.20 లక్షల మంది భక్తులే శివలింగాన్ని దర్శించుకున్నారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నందున యాత్రికుల రాకపై తీవ్రమైన ప్రభావం చూపింది.
ముగింపు సందర్భంగా మహంత్ దీపక్ గిరి సారథంలో సాధువులు వేకువజామునే పవిత్ర అమర్‌నాథ్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యాత్ర ముగియడంతో ఆలయాన్ని మూసివేసినట్టు ట్రస్ట్ బోర్డు ప్రకటించింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పహల్‌గావ్, బల్టాల్ నుంచి జూన్ 29న యాత్ర ప్రారంభమైంది. అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ లష్కరే తొయిబా మిలిటెంట్లు జూలై 10 యాత్రికుల బస్సుపై తెగబడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. వివిధ కారణాల వల్ల 40 మంది మృతి చెందరు. రోడ్డు ప్రమాదాల్లో 16 మంది చనిపోయారు. గుండె సంబంధింత సమస్యలతో మిగతావారు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.