జాతీయ వార్తలు

14 ఏళ్ల లోపు పిల్లలు ఉట్టికొట్టరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 7: జన్మాష్టమి సందర్భంగా ఉట్టుకొట్టే కార్యక్రమం (దహీహందీ)లో 14ఏళ్ల లోపు పిల్లలు పాల్గొనబోరని బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు దానిపై తాము ఎలాంటి ఆంక్షలు విధించలేమని తెలిపింది. న్యాయమూర్తులు బిఆర్ గవాయి, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ దహీహందీపై దాఖలైన పిటిషన్‌ను సోమవారం విచారించింది. ‘ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకునే జన్మాష్టమి ఉట్టి కార్యక్రమంలో పాల్గొనకుండా కోర్టు ఆంక్షలు విధించలేదు. ఇది మా పరిధిలోనిది కాదు’ అని బెంచ్ స్పష్టం చేసింది. అది శాసన పరిధిలోకి వస్తుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘శాసన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే, దాని పరిధిని అతిక్రమించినట్టే. కాబట్టి ఆంక్షలు అవసరమని భావిస్తే అసెంబ్లీనే ఆ పని చేస్తుంది’ అని కోర్టు పేర్కొంది. దహీహందీనిలో 14ఏళ్ల లోపు పిల్లలు పాల్గొనబోరని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో కోర్టు సంతృప్తి చెందిందని న్యాయమూర్తి గవాయి వెల్లడించారు. బాలకార్మికుల కింద 14ఏళ్ల లోపు పిల్లలు ఉట్టుకొట్టే ఉత్సవంలో పాల్గొనబోరంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.