జాతీయ వార్తలు

కదిలిన అమాత్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 12: గోరఖ్‌పూర్‌లో ప్రభుత్వ అధ్వర్యంలోని బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన సంఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 48 గంటల వ్యవదిలో 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గత అయిదు రోజుల్లో మొత్తం 63 మంది చిన్నారులు ప్రాంలు కోల్పోయినట్లు అధికారులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాదాపు ఇరవై ఏళ్లు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్ఠకు మచ్చగా మారడంతో ముఖ్యమంత్రే స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి వౌర్యతో పాటుగా ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య విద్యా శాఖ మంత్రి, ఉన్నతాధికారులను గోరఖ్‌పూర్‌కు పంపిన సిఎం ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సంఘటనపై దర్యాప్తుకు కమిటీని నియమించిన ప్రభుత్వం తాజాగా మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ మిశ్రాను సస్పెండ్ చేసింది. 1970నుంచే రాష్ట్రంలో మెదడువాపు వ్యాది సమస్య ఉందని చెప్పిన ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందన్నారు.
మరోవైపు కేంద్రం కూడా గోరఖ్ పూర్ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో శిశు మరణాలపై వాస్తవాలు తెలుసుకోవడానికి తక్షణమే అక్కడికి వెళ్లాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెడి నడ్డా తమ శాఖ సహాయ మంత్రి
అనుప్రియ పటేల్‌ను, ఆరోగ్య శాఖ కార్యదర్శి సికె మిశ్రాను శనివారం ఆదేశించారు. అలాగే వైద్య నిపుణుల బృందం కూడా గోరఖ్‌పూర్‌కు బయలుదేరి వెళ్లింది.
భగ్గుమన్న ప్రతిపక్షాలు
మరో వైపు ఈ సంఘటనపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. సంఘటనకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సంఘటన తనకు మాటలకు అందనంత బాధను కలిగించిందని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘటనకు బాధ్యులైన వారిని బిజెపి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శనివారం ఆస్పత్రిని సందర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాష్ట్ర ఆరోగ్య మంత్రిని తక్షణం మంత్రివర్గంనుంచి తొలగించాలని డిమాండ్ చేవారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా ఆయన కోరారు. కాగా, యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంఘటనపై అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. చిన్నారుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించి పంపేస్తున్నారని, కనీసం పోస్టుమార్టం కూడా జరిపించడం లేదని, ఇది చాలా దురదృష్టకరమని ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

చిత్రాలు.. ఆసుపత్రిలో వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రులు సిద్ధార్థ్‌నాథ్ సింగ్, అశుతోష్ టాండన్.
*బాధితులను పరామర్శించి వస్తున్న కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్